భారత స్వాతంత్ర్య పోరాటానికి ఎందరో విదేశీయులు ఎనలేని
కృషి చేశారు. ప్లాసీ యుద్ధం తరువాత, బ్రిటిష్ వారు భారతదేశ రాజకీయ, ఆర్థిక
మరియు సామాజిక రంగాలపై నియంత్రణ సాధించారు. సామ్రాజ్యవాద పాలన నుండి విముక్తి కోసం
భారతీయులు పోరాడారు. అనేక మంది విదేశీయులు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన
కృషి చేశారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధానంగా సహాయం చేసిన
విదేశీయులు కొందరు:
1. అన్నీ బెసెంట్:
అన్నీ బెసెంట్ లండన్‌లో అక్టోబర్ 1, 1847న
జన్మించారు. ఆధ్యాత్మిక సాంత్వన పొందేందుకు, థియోసాఫికల్ సొసైటీలో చేరారు.
అన్నీ బెసెంట్ థియోసాఫికల్ సొసైటీలో ఉన్న సమయంలో, హిందూమతం మరియు దాని ఆధ్యాత్మిక
ఆదర్శాల పట్ల ఆకర్షితురాలైంది. థియోసాఫికల్ సొసైటీ ఆలోచనలను ప్రచారం చేయడానికి
అన్నీ బెసెంట్ 1893లో భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో అన్నీ బెసెంట్
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమం లో చురుకుగా భాగమైంది.
హోమ్ రూల్ లీగ్ స్థాపన 1916లో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి బెసెంట్ యొక్క అత్యంత ముఖ్యమైన సహకారం. బీసెంట్ మరియు లోకమాన్య గంగాధర తిలక్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఐరిష్ స్థానిక ప్రభుత్వ ఉద్యమం తరహాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించారు. హోం రూల్ ఉద్యమం ఆస్ట్రేలియా మరియు కెనడాతో సహా భారతదేశం డొమినియన్ ప్రతిపత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉద్యమం రెండేళ్లపాటు కొనసాగింది, స్వాతంత్య్ర పోరాటాన్ని ఉధృతం చేయడంలో హోంరూల్ లీగ్ కార్యకలాపాలు ముఖ్యపాత్ర పోషించాయి.
2. చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్:
భారత స్వాతంత్ర్య పోరాటానికి చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ ఆంగ్లేయ మిత్రుడిగా పేరు పొందారు. భారతదేశంలో ఆండ్రూస్ సన్నిహిత సహచరులు గాంధీ మరియు ఠాగూర్. ఆండ్రూస్ తన చివరి శ్వాస వరకు భారత స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. ఆండ్రూస్ ఆంగ్లికన్ ప్రీస్ట్ మరియు చిన్నతనం నుండి భారతదేశం పట్ల మమకారం కలిగి ఉన్నాడు. 1915లో గాంధీని తనతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చేలా ఒప్పించడంలో ఆండ్రూస్ ముఖ్యమైన పాత్ర వహించాడు. ఆండ్రూస్, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌తో కలసి శాంతి నికేతన్‌లో ఎక్కువ సమయం గడిపాడు. ఆండ్రూస్ 1919లో ప్రసిద్ధ వైకోమ్ సత్యాగ్రహంలో చేరాడు మరియు 1933లో బి.ఆర్. అంబేద్కర్ దళితుల వాదనలను రూపొందించడంలో సహాయపడినాడు. ఆండ్రూస్, గాంధీజీని రెండవ లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు తీసుకువెళ్లాడు మరియు భారత స్వయంప్రతిపత్తి మరియు అధికార బదిలీపై బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సహాయం చేశాడు. భారతదేశ పోరాటానికి సహకారం కారణంగా, ఆండ్రూస్ ను “దీనబంధు” అని పిలుస్తారు.
3. మడేలిన్ స్లేడ్:
మడేలిన్ స్లేడ్, మీరాబెన్‌గా ప్రసిద్ధి చెందింది. మీరాబెన్ తరచుగా గాంధీజీ ప్రయాణాలలో అతని తో పాటు ఉండి గాంధీజీ వ్యక్తిగత అవసరాలను చూసుకునేవారు. మీరాబెన్ గాంధీకి నమ్మకస్థుల్లో ఒకరు మరియు బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పాటుపడినారు మరియు 1931 లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో గాంధీతో కలిసి ఉన్నారు. మీరాబెన్ అహింస స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో అంకితమైన కార్యకర్తగా పనిచేశారు మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన భాగస్వామిగా పరిగణించబడ్డారు. మీరాబెన్1932-1933లో శాసనోల్లంఘన ఉద్యమం లో సహా అనేకసార్లు అరెస్టు చేయబడినది..
4. సత్యానంద స్టోక్స్:
సత్యానంద స్టోక్స్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం నిరంతరం పనిచేసిన అమెరికన్ మరియు తరువాత భారతదేశంలో స్థిరపడ్డారు. హిమాచల్ యాపిల్స్ ఉత్పత్తికి ఆయన చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. బ్రిటీష్ పాలనలోని దురాగతాలను చూస్తూ వాటికి వ్యతిరేకంగా గళం విప్పారు. బ్రిటీష్ వారు జరిపిన జలియన్ వాలా ఊచకోతతో అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని మార్చివేసింది మరియు సత్యానంద స్టోక్స్ భారత రాజకీయాల్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. 1921లో, సత్యానంద స్టోక్స్ INCలో చేరాడు మరియు ఏకైక అమెరికన్‌గా నాగ్‌పూర్ సెషన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సత్యానంద స్టోక్స్, లాలా లజపతిరాయ్‌తో కలిసి పంజాబ్ నుండి INCకి ప్రాతినిధ్యం వహించాడు.
5. సిస్టర్ నివేదిత:
సిస్టర్ నివేదిత ఐరిష్ మహిళ, స్వామి వివేకానంద అనుచరురాలు. భారతదేశానికి వచ్చిన తరువాత, సిస్టర్ నివేదిత భారతదేశ స్వాతంత్ర్య పోరాటం కు దోహదపడింది. సిస్టర్ నివేదిత, అన్నీ బెసెంట్ మరియు శ్రీ అరబిందోలకు సన్నిహిత సహచరురాలు మరియు మహిళా విద్య వ్యాప్తి లో ప్రధాన పాత్ర పోషించింది. దేశ యువతను చైతన్యవంతులను చేయడంలో సిస్టర్ నివేదిత పాత్ర ఎంతో ఉంది. సిస్టర్ నివేదిత భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలపై ఉపన్యాసాలు ఇచ్చేవారు మరియు ప్రజలలో జాతీయ భావాలను ప్రోత్సహించారు. స్వదేశీ ఉద్యమంలో చురుకైన మార్గదర్శక పాత్ర పోషించారు.
6. మీరా అల్ఫోన్స్:
మీరా అల్ఫోన్స్ 'మథర్/అమ్మ'గా ప్రసిద్ధి చెందింది. మీరా అల్ఫోన్స్ 1978లో ప్యారిస్‌లో జన్మించారు. భారతదేశానికి వచ్చిన తర్వాత, మీరా అల్ఫోన్స్, శ్రీ అరబిందోచే బాగా ప్రభావితమైంది మరియు అన్నీ బిసెంట్ మరియు నెల్లీ సేన్‌గుప్తా వంటి మహిళలకు గొప్ప ప్రేరణనిచ్చింది. సుసంపన్నమైన వారసత్వం మరియు సంస్కృతికల భారత దేశ ఖ్యాతిని సుసంపన్నం చేయడంలో మీరా అల్ఫోన్స్ పాత్ర గొప్పది.
7. వెరియర్ ఎల్విన్:
వెరియర్ ఎల్విన్ మిషనరీ ప్రచారం కోసం భారతదేశానికి
వచ్చిన వలస బిషప్. వెరియర్ ఎల్విన్ NEFA మరియు భారతదేశంలోని గిరిజనులకు మార్గదర్శి.
గిరిజనుల కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయo. వెరియర్ ఎల్విన్ మహాత్మా గాంధీ వంటి
నాయకులతో కలిసి పనిచేశాడు మరియు భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ కి సహాయం
చేశాడు. స్వాతంత్ర్యం తరువాత, వెరియర్ ఎల్విన్ ఈశాన్య గిరిజన
వ్యవహారాలకు సలహాదారుగా ఎంపికయ్యాడు.
8. ఆల్ఫ్రెడ్ వెబ్:
ఆల్ఫ్రెడ్ వెబ్ ఒక ఐరిష్ వ్యక్తి, INCకి
అధ్యక్షత వహించిన మూడవ భారతీయేతరుడు మరియు భారత ప్రజల సంక్షేమం పట్ల గొప్ప శ్రద్ధ
ఉన్న వ్యక్తి. ఆల్ఫ్రెడ్ వెబ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే
దాదాభాయ్ నొరోజీకి సన్నిహిత సహచరుడు, ఆల్ఫ్రెడ్ వెబ్ బ్రిటిష్ వారిచే
భారతీయ సంపదను హరించుకుపోవడానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను వివరించాడు మరియు
బ్రిటిష్ ఉద్దేశాల గురించి భారతీయ ప్రజల కళ్ళు తెరిచాడు.
9. జార్జ్ యూల్:
జార్జ్ యూల్ INCకి అధ్యక్షత వహించిన నాల్గవ
భారతీయేతరుడు మరియు భారతీయుల పట్ల ఉదారవాద మరియు సానుభూతిగల దృక్పథాన్ని కలిగి
ఉన్నాడు. శాసన మండలిలో సంస్కరణలు, వివిధ అభిరుచుల వ్యక్తుల
ప్రవేశంపై ఆయన మాట్లాడారు.
10. హెన్రీ కాటన్:
హెన్రీ కాటన్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటo పట్ల సానుభూతిగల భారతీయ పౌర సేవకుడు. హెన్రీ కాటన్ 1904
సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు మరియు లార్డ్ కర్జన్
బెంగాల్ విభజన విధానాన్ని తీవ్రంగా విమర్శించాడు. విదేశీయుడైనప్పటికీ భారతీయుల
శ్రేయోభిలాషి.
11. విలియం వెడర్‌బర్న్:
విలియం వెడర్‌బర్న్ స్కాట్లాండ్‌లో జన్మించాడు మరియు బ్రిటిష్ సివిల్ సర్వెంట్‌గా భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో వెడర్‌బర్న్ ఆకలి, భారతీయ రైతుల పేదరికం, వ్యవసాయ రుణాల సమస్య మరియు పురాతన గ్రామ వ్యవస్థ పునరుద్ధరణపై దృష్టి సారించినాడు. ఈ సమస్యల గురించి అతని ఆందోళనలు అతన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ని సంప్రదించడానికి ప్రేరేపించాయి. విలియం వెడర్‌బర్న్ 1893లో లిబరల్ ఎంపీగా పార్లమెంటులోకి ప్రవేశించాడు మరియు కామన్స్ సభలో భారతదేశం యొక్క మనోవేదనలను వినిపించడానికి ప్రయత్నించాడు. విలియం వెడర్‌బర్న్ 1893 నుండి 1900 వరకు తన అధ్యక్షత భారత పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశాడు.
12.BG హార్నిమాన్:
బెంజమిన్ గై
హార్నిమాన్ బొంబాయి క్రానికల్ వార్తాపత్రిక సంపాదకుడు, ఇది సాధారణంగా బ్రిటిష్ వలస
ప్రభుత్వాన్ని ప్రశ్నించేది. 1919 నాటి జలియన్‌వాలా బాగ్ మారణకాండకు సంబంధించిన నివేదిక ప్రచురించ కూడాదన్న బ్రిటీష్
గ్యాగ్ ఆర్డర్‌ను హార్నిమాన్ దిక్కరించి ఏప్రిల్
13 సాయంత్రం
జరిగిన భయానక సంఘటనలను మరియు ప్రత్యక్ష సాక్షి లాలా గోవర్ధన్ దాస్ యొక్క కథనాన్ని
ప్రచురించాడు. హార్నిమాన్ జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ
ఫోటోలను ఇంగ్లాండ్ కు స్మగ్లింగ్ చేయగలిగాడు, ఇవి లండన్‌కు చెందిన వార్తాపత్రిక ది
డైలీ హెరాల్డ్‌లో ప్రచురించబడ్డాయి. ఇది సంఘటన పై అంతర్జాతీయ ఖంధన ను మరియు
భారతదేశ స్వాతంత్ర్య పోరాట గమనాన్ని మార్చింది.
జలియన్‌వాలాబాగ్
ఊచకోతలో హంటర్ కమిటీ డయ్యర్‌కు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు, హార్నిమాన్ తన పేపర్ లో దాన్ని
విమర్శించాడు. జలియన్‌వాలా దుర్ఘటన పై హార్నిమాన్ కవరేజీ, వలస అధికారులను చికాకు పెట్టింది మరియు
అతను తిరిగి బ్రిటన్‌కు బహిష్కరించబడ్డాడు. బి.జి. హార్నిమాన్ భారతదేశం నుండి
బహిష్కరించబడ్డాడు మరియు ఏడు సంవత్సరాలు హార్నిమాన్ ను భారత్ కు తిరిగి
రానివ్వలేదు. అయినప్పటికీ, హార్నిమాన్ 1925లో, సిలోన్ మీదుగా చాలా తెలివిగా
భారతదేశానికి తిరిగి వచ్చాడు. హార్నిమాన్ ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను కూడా
స్థాపించారు.
దక్షిణ బొంబాయిలోని ఒక ఉద్యానవనానికి బెంజమిన్ గై హార్నిమాన్ పేరు పెట్టారు. బి.జి. హార్నిమాన్ పేర ముంబై లోని హార్నిమాన్ సర్కిల్ కలదు.
13.ఫిలిప్
స్ప్రాట్:
ఆంగ్ల
తల్లిదండ్రులకు జన్మించిన ఫిలిప్ స్ప్రాట్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ విద్యావంతుడైన
కమ్యూనిస్ట్, ఫిలిప్ స్ప్రాట్ 1926లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ
నిర్మాణానికి మరియు విప్లవాన్ని ప్రేరేపించడానికి సహాయం చేయడానికి భారతదేశానికి
వచ్చారు. భారతదేశంలో శ్రామిక వర్గాన్ని సంఘటితం చేయడంలో తలదూర్చాడు. 1927లో ‘ఇండియా అండ్ చైనా’ అనే కరపత్రాన్ని రాసినందుకు ఫిలిప్
స్ప్రాట్ పై దేశద్రోహం అభియోగాలు మోపారు
భారతదేశములో ప్రారంభ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మరియు కమ్యూనిస్టులు నాయకత్వం వహించిన మిలిటెంట్ కార్మిక సంఘాలను ధ్వంసం చేయడానికి ఇంపీరియల్ అధికారులు ప్రయత్నించినప్పుడు 1929లో వరుస కార్మికుల సమ్మెలను నిర్వహించినందుకు సుమారు 30 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు మరియు ఇతరులను అరెస్టు చేసిన మీరట్ కుట్ర కేసులో, ఫిలిప్ స్ప్రాట్ ప్రధాన డిఫెండేoట్/ defendant/ప్రతివాది. బీఆర్ అంబేద్కర్ ఫిలిప్ స్ప్రాట్ కేసును స్వీకరించి గెలిచినాడు. స్ప్రాట్‌కు వాస్తవానికి 12 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది, కానీ అతని శిక్ష రెండు సంవత్సరాలకు తగ్గించబడింది మరియు స్ప్రాట్ 1934లో విడుదలయ్యాడు. తరువాత, ఫిలిప్ స్ప్రాట్, M.N మద్దతుదారుగా మారాడు.తరువాతి సంవత్సరాలలో, స్ప్రాట్ మద్రాసు నుండి పెట్టుబడిదారీ అనుకూల పత్రికకు సంపాదకుడిగా వ్యవరిస్తూ కమ్యూనిస్ట్ వ్యతిరేకిగా మారారు.
14.కేథరీన్ మేరీ హీలేమాన్ Catherine Mary Heilemann:
మహాత్మా గాంధీ యొక్క మరొక దత్తపుత్రికగా ప్రసిద్ధి చెందిన కేథరీన్, తరువాత సరళ అని పిలువబడింది, ఉదయపూర్‌లోని ఒక
పాఠశాలలో బోధించడానికి 1930ల ప్రారంభంలో భారతదేశానికి వచ్చింది.గాంధీ
స్ఫూర్తితో, 1940లలో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె రెండు
పర్యాయాలు జైలు శిక్ష అనుభవించారు.
విడుదలైన తరువాతి సంవత్సరాల్లో, కేథరీన్ కౌసని
వద్ద కస్తూర్బా మహిళా ఉత్థాన్ మండల్‌ను స్థాపించింది, ఇది ఉత్తరప్రదేశ్‌లోని కుమావోన్, గర్హ్వాల్ మరియు
ఇతర పర్వత జిల్లాలలోని పేద, అజ్ఞాన, వెనుకబడిన మరియు
అణగారిన మహిళలకు సహాయం చేయడానికి రూపొందించబడింది.
పాఠశాలలో కేథరీన్ విద్యార్థులు సామాజిక కార్యకర్తలుగా మారారు మరియు
కొంతమంది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యావరణ నిరసన - చిప్కో ఉద్యమంలో ప్రముఖ
పాత్ర పోషించారు.
సరళ 1982లో మరణించింది, కానీ ఆమె బోధనలు మరియు వారసత్వం కొనసాగుతుంది.
15.డిక్ (రాల్ఫ్
రిచర్డ్) కీథాన్:
రాల్ఫ్ రిచర్డ్ లేదా RR కీథాన్ 1920లలో అమెరికాలోని మిన్నెసోటాలోని ఫెయిర్‌మాంట్ నుండి, మిషనరీగా భారతదేశానికి వచ్చారు. డిక్ కీథాన్ గాంధీజీ నుండి ప్రేరణ పొందారు మరియు ఖాదీని కూడా స్వీకరించారు. డిక్ కీథాన్ కు
గాంధీజీ తో ఉన్న సామీప్యత వలన రెండుసార్లు ఇండియా నుండి బహిష్కరింపబాదినాడు.
అయినప్పటికీ, డిక్ కీథాన్ ప్రతిసారీ భూ సంస్కరణలు, స్థిరమైన వ్యవసాయం మరియు కుల మరియు లింగ భేదాల నిర్మూలనకు కొత్త నిబద్ధతతో
తిరిగి వచ్చాడు.
డిక్ కీథాన్ కులం మరియు జాతి మధ్య ఉన్న సారూప్యతలను గురించి రాశాడు మరియు
మార్టిన్ లూథర్ కింగ్‌తో క్లుప్తంగా ఉత్తరప్రత్యుత్తరాలు కూడా చేశాడు. డిక్ కీథాన్
తన జీవితంలో ఎక్కువ భాగం తమిళనాడు రాష్ట్రంలో పనిచేశాడు మరియు ఒడ్డంఛత్రం అనే
చిన్న పట్టణంలో తను సహాయం తో నిర్మించబడిన ఫెలోషిప్ ఆసుపత్రిలో 1984లో మరణించాడు.
స్వేచ్ఛ మరియు న్యాయం వంటి ఆదర్శాలు భౌగోళికంగా పరిమితం చేయబడవని రుజువు
చేసిన ఈ త్యాగపురుషుల జీవిత కథలు భారతదేశం
మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరు తెలుసుకోవాలి.
No comments:
Post a Comment