8 August 2022

దౌర్జన్యం & అసత్యానికి వ్యతిరేకంగా కర్బలాలో హుస్సేన్ బిన్ అలీ RAచేసిన పోరాటం Hussain bin Ali RA at Karbala – A fight against tyranny & falsehood

 


మానవ చరిత్ర అధికార దుర్వినియోగం, అణచివేత, అన్యాయం, క్రూరత్వం, హత్య మరియు మారణహోమం యొక్క అంతులేని కథ. న్యాయం, సానుభూతి మరియు దయాదాక్షిణ్యాలతో పాలించిన వ్యక్తులు చాలా తక్కువ. అధికారo కోసం  కుతంత్రాలు, బలవంతం, మోసపూరిత ప్రచారాలు మరియు అసత్యాల పాల్పడటం చివరకు అన్యాయం, రక్తపాతం మరియు విధ్వంసంతో ముగుస్తుంది. ఇది చరిత్ర నేర్పిన గుణపాఠo.

సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రతినిధులు కాకుండా కొంతమంది నిరంకుశ సార్వభౌమాధికార హక్కును స్వీకరించినప్పుడు "ఫసద్ ఫిల్ అర్ధ్" (భూమిపై అవినీతి / సమాజంలో గందరగోళం) చెలరేగును.  ఈమాన్’ (విశ్వాసం), ‘తఖ్వా’ (ధర్మం), ‘అద్ల్’ (న్యాయం) ఆధారంగా సమాజాన్ని సృష్టించేందుకు ఇస్లాం వచ్చింది. మరియు విశ్వాసం, దైవభక్తి మరియు న్యాయం ఆధారంగా వ్యవస్థను స్థాపించే పోరాటాన్ని జిహాద్ అంటారు.

కర్బలా అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రియమైన మనవడు హుస్సేన్ బిన్ అలీ RA అనే ​​ధైర్యవంతుడి కథ. హుస్సేన్ బిన్ అలీ RA సత్యం, న్యాయం మరియు ప్రజల హక్కులు మరియు  అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలిచాడు. హుస్సేన్ బిన్ అలీ RA తన జీవితాన్ని, తన  కుటుంబాన్ని మరియు తన అనుచరుల చిన్న సమూహాన్ని పణంగా పెట్టి విశ్వాసo  మరియు మానవత్వం కు అండగా నిలిచాడు. హుస్సేన్ బిన్ అలీ RA ఆదర్శప్రాయమైన త్యాగం, నిజాయతీగా జీవించాలనుకునే వారందరికీ ఒక ఉదాహరణ. అల్లాహ్ SWT అతనికి, అతని కుటుంబానికి మరియు నిజమైన విశ్వాసులందరికీ దయను ప్రసాదించుగాక.

అల్-హసన్ మరియు అల్-హుస్సేన్ స్వర్గం యొక్క యువక నాయకులు." (అహ్మద్, అత్-తిర్మిది, ఇబ్న్ మాజా మరియు అన్-నసాయీ)

హుస్సేన్ బిన్ అలీ RA సత్యం విషయంలో రాజీ పడేందుకు నిరాకరించారు. హుస్సేన్ బిన్ అలీ RA, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ తన   జీవితాన్ని త్యాగం చేసారు  మరియు వారి అడుగుజాడలను అనుసరించి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అల్లాహ్ SWT వారందరికీ ప్రతిఫలమివ్వాలి మరియు మనం వారి అడుగుజాడల్లో నడుద్దాము.

అత్యంత గౌరవనీయమైన మరియు అత్యంత ప్రియమైన హుస్సేన్ RA తమ కాలపు నిరంకుశ శక్తికి వ్యతిరేకంగా నిలబడి అమరులైరనారు. దుష్టుడు మరియు క్రూరమైన పాలకుడితో నిజం మాట్లాడటం అత్యున్నతమైన ఆరాధన (జిహాద్). దానికి అపారమైన ధైర్యం మరియు భగవంతునిపై నమ్మకం అవసరం. అన్ని ప్రాపంచిక సుఖాల కంటే సత్యం కోసం నిలబడాలని భావించే వ్యక్తులను చరిత్ర లో మనం చూడవచ్చు. వారు న్యాయం, సత్యం అనే జ్యోతిని సజీవంగా నిలిపారు.

హుస్సేన్ బిన్ అలీ RA చేసిన అపారమైన త్యాగాన్ని మనం మరువలేము. ఇస్లాం విశ్వాసం యొక్క సారాంశాన్ని నాశనం చేసేవారికి వ్యతిరేకంగా హుస్సేన్ RA పోరాడారు. హుస్సేన్ బిన్ అలీ RA ఏ కొత్త సిద్ధాంతాన్ని లేదా కొత్త నమ్మకాలను పరిచయం చేయలేదు. హుస్సేన్ బిన్ అలీ RA తన తాత ప్రవక్త మహమ్మద్ యొక్క ఆదర్శాలకు బలమైన అనుచరుడు. హుస్సేన్ బిన్ అలీ RA ఇస్లామిక్ ప్రమాణాలతో జీవించాడు మరియు ఇస్లామిక్ చరిత్రలో విశ్వాసులకు సరైన మార్గనిర్దేశం చేసిన ఖలీఫాలు అబూ బకర్ RA, ఒమర్ RA, ఉస్మాన్ RA మరియు అలీ RA మరియు మన ప్రియ ప్రవక్త యొక్క ఇతర సహచరులు/సహాబాలు మొదలగు శక్తివంతమైన వ్యక్తుల అడుగుజాడలను అనుసరించాడు. అన్యాయం, దౌర్జన్యం మరియు అబద్ధానికి వ్యతిరేకంగా జిహాద్ చేసాడు.  

మనము హుస్సేన్ RA ను ప్రేమిస్తే మరియు గౌరవిస్తే, అల్లాహ్, అతని ప్రవక్త , అతని దీన్, న్యాయం మరియు సత్యం కోసం ప్రతిదాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడి జీవించాలి. ఇంట్లో మరియు కార్యాలయంలో, మసజిద్‌లో, మరియు మనం మన ప్రభువును కలిసే వరకు సత్యం మరియు న్యాయానికి మద్దతుగా ఉండాలి మరియు అప్పుడే మరణ సమయంలో ఈ క్రింది వ్యాఖ్యలతో స్వాగతించబడే అదృష్ట వ్యక్తులలో మనం కూడా ఉంటాము:

“తృప్తి చెందిన మనసా! పద నీ ప్రభువు సన్నిదికి, (నీకు లభించే సత్ఫలానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ఇష్టమైన దానివై. చేరిపో (పుణ్యాత్ములైన) నా దాసులలో, ప్రవేశించు నా స్వర్గం లో.” (దివ్య ఖురాన్ 89 - 27 నుండి 30 వరకు).

 

No comments:

Post a Comment