5 August 2022

దఖ్నీ ఉర్దూ సాహిత్య చరిత్ర The history of Dakhni Urdu literature

 

రెండవది ఇబ్రహీం ఆదిల్ షా రచించిన కితాబ్-ఇ-నౌరస్ నుండి ఫోలియో

పద్నాలుగో నుండి పదిహేడవ శతాబ్దం చివరి వరకు నేటి హైదరాబాద్ పరిసర ప్రాంతాన్ని పాలించిన డెక్కన్ సుల్తాను రాజ్యాల ప్రధాన సాహిత్య భాష పెర్షియన్‌తో పాటు దఖ్నీ .

కొంతమంది కి దఖ్నీ అనేది ఈనాడు హైదరాబాద్‌లో మరియు దాని పరిసరాలలో మాట్లాడే భాషగా తెలిసి ఉండవచ్చు.కొన్నిసార్లు దీనిని దఖ్నీ ఉర్దూ, హైదరాబాదీ లేదా హైదరాబాదీ హిందీ అని కూడా పిలుస్తారు. ఆధునిక దఖ్నీ ప్రామాణిక ఉర్దూను పోలి ఉంటుంది, కానీ విభిన్న పదాలు మరియు పదబంధాలను (distinct words and phrases) ఉపయోగించడం ద్వారా విభిన్నంగా ఉంటుంది. వీటిలో కొన్ని మరాఠీ వంటి పొరుగు భాషల నుండి తీసుకోబడ్డాయి.

నేడు, కొందరు దీనిని మాండలికం (లేదా యాస కూడా) అని పిలుస్తారు, మరికొందరు దీనిని స్వతంత్ర భాష అని పిలుస్తారు. దఖ్ని తెలంగాణలోనే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అంతటా ప్రాంతీయ రకాలు regional varieties గా వినిపిస్తుంది. ప్రధానంగా (ప్రత్యేకంగా కాకపోయినా) ముస్లింలచే మాట్లాడబడిన దఖ్నీ దానిని మాట్లాడేవారిని ఏకం చేస్తుంది.

దఖ్నీ భాష దక్కన్ ప్రాంతం అంతటా ఉపయోగించబడుతుంది. భారతదేశంలోని దక్కన్ ప్రాంతం భాషా మరియు సాంస్కృతిక వైవిధ్యం కలిగి ఉంది. ఇక్కడ అరబిక్, పర్షియన్ మరియు సంస్కృతంతో పాటు మరాఠీ మరియు తెలుగులో సాహిత్యం వృద్ధి చెందింది.

దక్కన్‌లోకి వలస

అరేబియా ద్వీపకల్పం, ఇరాన్, తూర్పు ఆఫ్రికా మరియు ఐరోపా నుండి ప్రజల వలస  ఈ ప్రాంతానికి కొత్త వస్తువులు, ఆలోచనలను తీసుకువచ్చింది.

పూర్వ ఆధునిక premodern దఖ్నీ పద్నాలుగో శతాబ్దంలో రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఆధ్వర్యంలో ఢిల్లీ సుల్తానేట్ విజయాలు మరియు దౌల్తాబాద్‌లో కొత్త రాజధానిని స్థాపించిన తరువాత ఉత్తర భారతీయ ముస్లింలు దక్కన్‌కు వలస వచ్చినప్పుడు ఇది జరిగింది.

ఈ వలసదారులు హిందావి లేదా దిహ్లావి మాట్లేడేవారు. ప్రారంభంలో చిస్తీ మరియు ఖాదిరి సూఫీ ఆదేశాలకు చెందిన రచయితలచే వాడబడిన  దఖ్నీ క్రమేణా డెక్కన్ సుల్తానేట్‌ల న్యాయస్థానాలలో లిరిక్ పొయమ్స్, పద్య కథనాలు verse narratives మరియు ఇతర సాహిత్య రచనలు రాయడానికి ఎంపిక చేసుకునే భాషగా మారింది.

కదమ్ రావ్ పదమ్ రావ్ - దఖ్నీ యొక్క మొట్టమొదటి పద్యము Kadam Rao Padam Rao – earliest known verse of Dakhni:

దఖ్నీలో మొట్టమొదటిగా తెలిసిన పద్య కథనం కు  “కదమ్ రావ్ పదమ్ రావ్” అని పేరు పెట్టబడింది. పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో, బహమనీ రాజ్యం దక్కన్‌లోని పెద్ద భాగాలను పాలించింది. తరువాతి రెండు శతాబ్దాలలో, నిజాం షాహీ, ఆదిల్ షాహీ మరియు కుతుబ్ షాహీ సుల్తానేట్స్ (వరుసగా అహ్మద్‌నగర్, బీజాపూర్ మరియు గోల్కొండలలో) స్థాపించబడిన తర్వాత, దఖ్నీ న్యాయస్థానాలలో ప్రధాన సాహిత్య భాషగా మారింది.

దఖ్నీ భాష ప్రారంభం నుండి, అనేక మంది దఖ్నీ రచయితలు భారతీయ నేపద్యం లో నుండి తీసుకోబడిన ఇతివృత్తాలు మరియు సాహిత్య రూపాలను లిఖించారు. ఉదాహరణకు, మస్నవి కదమ్ రావ్ పదమ్ రావు పూర్తిగా ముస్లిమేతర పాత్రలపై నిండి ఉంది. అవి  రాజు కదమ్ రావు, అతని ఇద్దరు మంత్రులు మరియు ఒక యోగి. పదహారవ శతాబ్దం చివరలో, బీజాపూర్ సుల్తానేట్ పాలకుడు ఇబ్రహీం ఆదిల్ షా II కితాబ్-ఇనౌరస్ Kitab-iNauras అనే పాటల పుస్తకాన్ని రచించాడు.

హిందూ దేవతలు మరియు భారతీయ సంగీత రీతులు పై పాటలు రాయడంతో పాటు, ఆ సమయంలో భారతదేశం అంతటా సంగీత కంపోజిషన్లకు ఉపయోగించబడే  పదం pada, యొక్క సాహిత్య రూపంలో వాటిని స్వరపరిచారు,.

ముహమ్మద్ కులీ కుతుబ్ షా, హైదరాబాద్ వ్యవస్థాపకుడు మరియు గోల్కొండ రాజు, పర్షియన్ కవితా రూపంలో గజల్‌లో వ్రాసేటప్పుడు వర్ష ఋతువు /మాన్‌సూన్, లవ్‌సిక్‌నెస్/విరహం వంటి ఇతివృత్తాలను చేర్చారు. పెమ్ నెమండ్ గుల్షన్-ఇష్క్ Pem Nemand Gulshan-iIshq వంటి దఖ్నీ రొమాన్స్ రచయితలు సూఫీ ఇతివృత్తాలను రాసారు మరియు వారి కవితలను భారతీయ భౌగోళికం మరియు ప్రకృతి దృశ్యం geography and landscape లో అమర్చారు.

భారతీయ మరియు ఇరానియన్ అంశాల విలీనం:

ఇటీవల, డెబోరా హట్టన్ వంటి కళా చరిత్రకారులు పూర్వపు దక్కన్ సుల్తానేట్‌లలోని నిర్మాణ స్మారక కట్టడాలలో భారతీయ మరియు ఇరానియన్ అంశాలను చేర్చడం పట్ల దృష్టిని సారించారు. సాంప్రదాయ దఖ్నీ సాహిత్యం- హిందావి మరియు సంస్కృతం, అలాగే పర్షియన్ మరియు అరబిక్ నుండి తీసుకోబడిన విభిన్న సాహిత్య నమూనాల కలయిక.

సాహిత్య భాషని రూపొందించడంలో, దఖ్నీ రచయితలు చాలా కొత్తదాన్ని సృష్టించి, విభిన్న మూలాల నుండి ప్రేరణ పొందారు

దఖ్నీ రచయితలు భారతీయ చిత్రాలు మరియు ఇతివృత్తాల తో పాటు పెర్షియన్ నమూనాలపై ఎక్కువగా ఆధారపడేవారు. పద్నాలుగో శతాబ్దంలో బహమనీ సుల్తానేట్ ప్రారంభం నుండి, ఇరానియన్ పండితులు మరియు పాలనా అధికారులు దక్కని రాజ్యాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు. పదహారవ మరియు పదిహేడవ శతాబ్దాల నాటికి, దఖానీ వాడకం విస్తృతమైనది కాని  పర్షియన్ పాత్ర తగ్గలేదు.

అధికారిక మరియు పరిపాలనా భాషగా పెర్షియన్ పాత్ర:

సుల్తానేట్స్‌లో పర్షియన్ ప్రాథమిక పరిపాలన భాషగా ఉపయోగించబడడమే కాకుండా బీజాపూర్ మరియు గోల్కొండ రాజులు దఖ్నీతో పాటు పర్షియన్ రచనలకు నిధులు సమకూర్చడం కొనసాగించారు. చారిత్రాత్మకంగా, డెక్కన్ సుల్తానేట్స్‌లో పోటీపడే విబిన్న సామాజిక సమూహాలు తరచుగా పండితులు దృష్టిని ఆకర్షించారు.

వీరిలో అఫాకిలు (ఇరాన్ నుండి కొత్తగా వచ్చినవారు) మరియు దఖ్నీలు (తరతరాలుగా దక్కన్‌లో ఉన్న కుటుంబాలు లేదా తూర్పు ఆఫ్రికన్‌లు-మొదట్లో ఈ ప్రాంతానికి బానిసలుగా తీసుకురాబడిన వ్యక్తులు) ఉన్నారు. కానీ ఇటీవల, సుబహ్ దయాల్ వంటి చరిత్రకారులు ఈ రెండు సమూహాల మధ్య గణనీయమైన ఘర్షణ వాతావరణం ఉందని అన్నారు. కాని ఇది ఎల్లప్పుడూ పర్షియన్ మరియు దఖ్నీ భాషలపై ప్రభావం చూపలేదు.

కుతుబ్ షాహీలచే నియమించబడిన “వాజీ” వంటి అనేకమంది రచయితలు-రెండు భాషల్లోనూ రాశారు. దఖ్నీలో ప్రత్యేకంగా వ్రాసిన వారు కూడా పర్షియన్ సాహిత్యo లో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. చాలా దఖ్నీ గ్రంథాలు పెర్షియన్ శైలిలో మరియు పెర్షియన్ ప్రమాణాల ప్రకారం వ్రాయబడ్డాయి మరియు అనేక అనువాదాలు పర్షియన్ నుండి దఖ్నీలోకి వచ్చాయి.



హైదరాబాద్ వ్యవస్థాపకుడు మొహమ్మద్  కులీ కుతుబ్ షా

పెర్షియన్ లాగా కాకుండా దఖ్నీ” దక్షిణాసియా వెలుపల విస్తృతమైన, పర్షియన్-అక్షరాస్యులైన పాఠకులకు అర్థం కాదని దఖ్నీ పోషకులు మరియు కవులు గుర్తించారు. అయినప్పటికీ, దఖ్నీ రచయితలు దక్కన్ వెలుపల ఉన్న రచయితలు మరియు పాఠకులతో సంబంధాలను ఏర్పరచుకున్నారు. కొంతమంది రచయితలు గుజరాత్ లేదా ఉత్తర భారతదేశం నుండి వారి గ్రంథాలు మరియు సాహిత్య సంప్రదాయాల మధ్య లింక్‌ను సృష్టించడం చేసారు. వారు వ్రాసిన భాషని గుజ్రీ, హిందావి లేదా హిందీ అని కూడా పిలుస్తారు.

దఖ్నీ,  పర్షియన్ మరియు ప్రాంతీయ భాషలైన కన్నడ, మరాఠీ మరియు తెలుగు మధ్య ఎక్కడో ఒక హోదాను కలిగి ఉంది. పర్షియన్‌తో అనుబంధాల వల్ల పూర్వ ఆధునిక premodern దఖ్నీ రచయితలు స్థానానికి ప్రాధాన్యత ఇవ్వలేదని కాదు. పదిహేనవ శతాబ్దంలో, మస్నవి రచయిత కదం రావ్ పదమ్ రావ్ తనను మరియు అతని పోషకుడిని himself and his patron దక్కన్‌లో ఉంచుకున్నాడు.

దఖ్నీ సాహిత్యం యొక్క విభిన్న చరిత్రలో, రచయితలు తమ రచనల పట్ల సుదూర ఆకాంక్షలను కలిగి ఉన్నారు, అయినప్పటికీ భాష మరియు ప్రాంతం మధ్య సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు.

మూల రచయిత: హైదరాబాద్‌లో నివసించే జొ వుడ్‌బరీ హై చికాగో విశ్వవిద్యాలయంలో సౌత్ ఏషియన్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్ విభాగంలో PhD అభ్యర్థి. ఆమె పరిశోధన అంశం: ఇబ్రహీం ఆదిల్ షా II ఆధ్వర్యంలో బీజాపూర్ కోర్టులో సాహిత్య, సాంస్కృతిక మరియు మతపరమైన పరస్పర చర్యలు.

తెలుగు సేత: సల్మాన్ హైదర్ 

No comments:

Post a Comment