25 August 2022

110 ఏళ్ల చరిత్ర గల తిరుచ్చి పాఠశాల చాలా మంది ముస్లిం బాలికలకు విద్యా సాధికారత కల్పించింది.

 


ముస్లిం బాలికా విద్యా సాధికారికత:


తిరిచ్చి తారణల్లూర్‌ తూర్పు బౌలేవార్డ్ రోడ్డులో గల  విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ (VGGGMHSS) కు 110 ఏళ్ల చరిత్ర ఉంది. విస్కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఉర్దూ, తమిళం మరియు ఆంగ్ల మాధ్యమాల్లో పాఠాలు నేర్చుకొంటున్నారు.

ముస్లిం బాలికల కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రెండు స్కూల్స్ లో ఇది ఒకటి. రెండోవ స్కూల్ 1870లలో చెన్నైలో ముస్లిం బాలికల కోసం స్థాపించబడిన హోబర్ట్ స్కూల్ (ప్రస్తుతం ప్రభుత్వ హోబర్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్ అని పిలుస్తారు).

1910లో స్థాపించబడిన తిరుచ్చిలోని ఉర్దూ-మీడియం పాఠశాలకు బ్రిటీష్ పార్లమెంటేరియన్ మరియు మద్రాస్ మాజీ గవర్నర్ విస్కౌంట్ జార్జ్ జోచిమ్ గోషెన్ భార్య అయిన లేడీ మార్గరెట్ ఎవెలిన్ గాథోర్న్-హార్డీ పేరు పెట్టారు.

విస్కౌంటెస్ గోస్చెన్ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు అనుబంధంగా ఉన్న మోడల్ స్కూల్ 1939-40లో సెకండరీ స్కూల్‌గా మార్చబడింది. ఇది ఆగస్టు 2018లో హయ్యర్ సెకండరీకి ​​అప్‌గ్రేడ్ చేయబడింది.

విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ (VGGGMHSS) ఆధునిక సిలబస్  కలిగి  మరియు ప్రత్యేక మతపరమైన బోధనతో ముస్లిం కమ్యూనిటీ యొక్క విద్యా అవసరాలకు అనుగుణంగా ఉంది, స్కూల్ డ్రాప్ అవుట్ గా మారి, చిన్న వయస్సులోనే వివాహం చేసుకునే ఆడపిల్లల విద్యా పరిస్థితి మెరుగుపరచడం ఈ స్కూల్ ముఖ్య ఉద్దేశం.

విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ (VGGGMHSS) స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి ఇంద్రాణి ప్రకారం  ఈ స్కూల్ ఉచ్ఛదశలో ఉన్నప్పుడు 1,000 మంది విద్యార్థులు ఉండేవారు. వారు బీమా నగర్, వరగనేరి, పాలక్కరై, నథర్‌షా వలీ దర్గా, తెన్నూరు, వరైయూర్, ఖాజా మలై, తిరుచ్చిలోని పొన్ మలై మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఇతర ప్రాంతాల నుండి ఉర్దూ  చదువుకోవటానికి పిల్లలు ఇక్కడకు వచ్చేవారు.

పాత రోజుల్లో, పర్దా పద్ధతిలో ఉన్నప్పుడు, బురఖా ధరించిన ముస్లిం బాలికలు గుడ్డ తెరలు  అమర్చబడిన  గుర్రం మరియు ఎద్దుల బండ్లలో ప్రయాణించేవారు.  స్కూల్ వెనుక ద్వారం గుండా బండ్లు నేరుగా స్కూల్ కాంపౌండ్‌లోకి వెళ్లేవి. ముస్లిం బాలికలు స్కూల్ లోపలికి వచ్చిన తర్వాత, పర్దా తొలగించేవారు. కానీ క్యాంపస్ లో మాత్రం  పురుషులకు ప్రవేశం లేదు," అని ప్రిన్సిపాల్ ఇంద్రాణి చెప్పారు.తమిళం మాతృభాష కల అనేక ప్రముఖ ముస్లిం కుటుంబాలు, స్కూల్ యొక్క సురక్షితమైన వాతావరణం వలన తమ ఆడ పిల్లలను ఇక్కడికి పంపేవారు.

స్వాతంత్య్రానంతరం తమిళనాడు విద్యా విధానంలో ఆంగ్లం మరియు తమిళం ప్రాధాన్యత సంతరించుకోవడంతో విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ (VGGGMHSS) తన ప్రాధాన్యతను కోల్పోయింది, తమిళనాడులో ఉర్దూ క్షీణించింది. ఉర్దూ మాధ్యమంలో ఉన్నత పాఠశాల విద్య లేకపోవడం మరో అడ్డంకిగా మారింది.

అధ్యాపకులు మరియు సామాజిక కార్యకర్తలు,  ముస్లిం వ్యాపార సంస్థలు, స్థానిక ముస్లిం సమాజం నుండి విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ (VGGGMHSS) లో అడ్మిషన్ల కోసం కాన్వాసింగ్ చేయడం ద్వారా పాఠశాలను కాపాడేందుకు ఏకమయ్యారు.. కానీ స్పందన సరిగా లేనప్పుడు, వారు కర్ణాటక నుండి 25 మంది విద్యార్థులను తీసుకువచ్చారు.

విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ (VGGGMHSS) పాఠశాల పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర పేరెంట్-టీచర్ అసోసియేషన్ (PTA) యొక్క అనుబంధ సంస్థ అయిన గోస్చెన్ స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీ పోషించినది.  

నేడు విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ VGGGMHSSలో 314 మంది పిల్లలు ఉన్నారు. విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు తమిళం లేదా ఇంగ్లీషులోకి మారే అవకాశంతో పాటు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మాత్రమే ఉర్దూ మాధ్యమాన్ని అందిస్తోంది. పాఠశాల వార్షిక పరీక్షలలో మంచి ఉత్తీర్ణత రేటును కలిగి ఉంది.

చాలా మంది విద్యార్థులు సామాజికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వస్తున్నందున, స్కూల్ యొక్క PTA వారికి ఉచిత అల్పాహారం మరియు రవాణాను అందిస్తుంది. విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ VGGGMHSS  సాయంత్రం వేళ,   1 నుండి 9వ తరగతి వరకు బాలికలకు దీనియత్ లేదా మతపరమైన తరగతులను కూడా నిర్వహిస్తుంది. విస్‌కౌంటెస్ గోస్చెన్ ప్రభుత్వ బాలికల (ముస్లిం) హయ్యర్ సెకండరీ స్కూల్ VGGGMHSS లో  నుండి ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం అమలులో  ఉంది అని ప్రిన్సిపాల్ ఇంద్రాణి చెప్పారు.

 

మూలం: thehindu.com ఆగస్టు 02, 2019

No comments:

Post a Comment