"రండి!
పోరాడండి,
దేవుడు మిమ్మల్లి స్వర్గంలోకి పిలిచాడు."
1857
వేసవికాలంలో బ్రిటీష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడాలని, కత్తి
మరియు తుపాకీ ధరించి, గుర్రంపై స్వారీ
చేస్తూ ఆకుపచ్చ బురఖా ధరించిన ఒక వృద్ధురాలు ఢిల్లీ నివాసితులకు పిలుపునిస్తూ ముందుకు సాగింది. ఆమె వెనుక ఉన్న డిల్లి పౌరులు మరియు రిడ్జ్
మరియు కాశ్మీరీ గేట్ వద్ద ఉన్న బ్రిటిష్ దళాలపై దాడి చేశారు. ఆమె ఎవరో ప్రజలకు
తెలియదు. ఆమె గుర్రంపై కనిపిస్తుంది మరియు
దాడి తర్వాత అదృశ్యమవుతుంది.
జూలై 29,
1857 నాటి లేఖలో, లెఫ్టినెంట్
హడ్సన్ అంబాలా డిప్యూటీ కమీషనర్‌కి ఈ వృద్ద ముస్లిం మహిళ చాలా ప్రమాదకరమైన స్త్రీ
అని మరియు బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు ఢిల్లీవాసులను ప్రేరేపిస్తుంది అని
తెలిపారు. ఆమె ప్రజలను ప్రేపిస్తుంది మరియు శిక్షణ పొందిన బ్రిటీష్ సైన్యంతో
యుద్ధంలో శిక్షణ పొందని పౌరులను నాయకత్వం వహించే కమాండర్ అని తెలిపారు.. ఆమె కత్తులతో పోరాడడంలో
మరియు తుపాకులతో కాల్చడంలో నిపుణురాలు అని హడ్సన్ అన్నాడు. ఆమె వివిధ పోరాటాల సమయంలో చాలా
మంది బ్రిటిష్ సైనికులను చంపింది.
హడ్సన్ ఈ మహిళ యొక్క ధైర్యసాహసాలకు మెచ్చుకొంటూ ఆమెను ఫ్రాన్స్‌కు చెందిన జోన్ ఆఫ్ ఆర్క్ తో పోల్చడం ద్వారా నివాళులర్పించారు. ఈ ఆకుపచ్చని దుస్తులు ధరించే ముస్లిం మహిళ యొక్క ధైర్యం, నాయకత్వం మరియు పరాక్రమం జోన్ ఆఫ్ ఆర్క్ కంటే తక్కువ కాదని అతను పేర్కొన్నాడు.
ఢిల్లీలోని రిడ్జ్ వద్ద జరిగిన ఒక యుద్ధంలో ఆమె గుర్రం మీద నుండి పడి బంధించబడింది. బ్రిటిష్ ఆర్మీ జనరల్, ఆ వృద్ధ ముస్లిం స్త్రీని చూస్తూ, ప్రమాదం లేదని భావించి, ఆమెను విడుదల చేయమని ఆదేశించాడు. అప్పుడు లెఫ్టినెంట్ హడ్సన్ జోక్యం చేసుకొని ఈ వృద్ద మహిళ, భారతీయు పౌర కమాండర్ అని, ప్రమాదకరమైన మహిళ అని ఆర్మీ జనరల్‌తో చెప్పాడు. అనంతరం వృద్ధురాలిని అంబాలాలోని జైలుకు తరలించాలని నిర్ణయించారు.
ఈ ధైర్యవంతులైన
వృద్ధురాలు జూలై, 1857లో
అంబాలాకు తరలించబడినది. ఆమె పేరు లేదా అంబాలాలో ఆమెకు ఏమి జరిగిందో మనకు తెలియదు,
కానీ
ఖచ్చితంగా ఈ ఆకుపచ్చ బురఖా ధరించిన వృద్ధురాలు 1857 ప్రధమ భారత
స్వతంత్ర సంగ్రామం లో పాల్గొన్న అజ్ఞాత హీరోలలో ఒకరు. ఆమె భారతదేశాన్ని పరాయి పాలన
నుండి విముక్తి చేసేందుకు జ్వాల రగిలించారు..
No comments:
Post a Comment