3 August 2022

నాల్-ఎ-ముబారక్: హైదరాబాద్ గోల్కొండ శకం యొక్క అంతగా తెలియని అవశేషం Naal-e-Mubarak: A lesser-known relic of Hyderabad’s Golconda er

 

హైదరాబాద్‌లోని నాల్-ఎ-ముబారక్ అషుర్ఖానాలోని ఆలం. (ఫోటో: Siasat.com/Md. సిబ్ఘతుల్లా ఖాన్)

హైదరాబాద్ నగరంలోని పురాతన అషుర్ఖానాలలో పతేర్‌గట్టి వద్ద ఉన్న 'నాల్-ఎ-ముబారక్' వాస్తవానికి ఇక్కడ ముహర్రంలో కార్యకలాపాలు ఎక్కవుగా జరుగును.  

2022జూలై 31 న, ఇస్లామిక్ క్యాలెండర్ (హిజ్రీ) మొదటి నెల - ముహర్రం - ప్రారంభమైంది. అషుర్ఖానా లో షియా ముస్లింలు ముహర్రం 10వ రోజు అషూరా సందర్భంగా దుఃఖిస్తారు. నాల్-ఎ-ముబారక్ వంటి ప్రదేశాలు కర్బలా (ఇరాక్) యుద్ధంలో మరణించిన ప్రవక్త మొహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్‌కు అంకితం చేయబడ్డాయి.

ఇమామ్ హుస్సేన్ ప్రవక్త(స) యొక్క అల్లుడు (మరియు బంధువు) ఇమామ్ అలీ కుమారుడు. షియా ముస్లింలు అతని అనుచరులు. హైదరాబాద్ 1591లో షియా ముస్లిం కుతుబ్ షాహీ రాజవంశంచే స్థాపించబడింది. అందువల్ల నగరంలో నల్-ఎ-ముబారక్ వంటి అషుర్ఖానాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

 నాల్-ఎ-ముబారక్ అషుర్ఖానా పర్షియన్ చేత నిర్మించబడింది:

కుతుబ్ షాహీ పాలనలో నాల్-ఎ-ముబారక్ ఏర్పాటు చేయబడింది. దీనిని ఇరానియన్ మతాధికారి అలీ షా ఇక్కడికి తీసుకువచ్చారని నమ్ముతారు.

నాల్-ఎ-ముబారక్‌లో సాధారణంగా యోధుల హెల్మెట్‌కి అతికించబడిన చిన్న చంద్రుడు మరియు నక్షత్రం ఉంటుంది. హెల్మెట్‌ను హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ధరించినట్లు భావిస్తున్నారు.

అషుర్ఖానా సంరక్షకుల ప్రకారం, హజ్రత్ ఇమామ్ హుస్సేన్ యొక్క అవశేషాలను యూసుఫ్ ఆదిల్ షా (1450-1511 CE) పాలనలో ఇరాన్ నుండి బీజాపూర్‌కు మొదట షా అలీ తీసుకువచ్చారు. తరువాత, సుల్తాన్ కులీ (1518-43) పాలనలో గోల్కొండకు తీసుకురాబడింది.

నల్-ఎ-ముబారక్‌కు చెందిన ఆలం మొదట గోల్కొండ కోటలో ఉంచబడిందని, తరువాత దానిని హైదరాబాద్‌ స్థాపించినప్పుడు హైదరాబాద్‌కు తరలించారని తెలుస్తుంది..

ప్రస్తుత ఆలం 1222 హిజ్రీలో, నిజాం కాలంలో రెండవ చక్రవర్తి నిజాం అలీ ఖాన్ ఆధ్వర్యంలో తీసుకురాబడింది. నాల్-ఎ-ముబారక్ నిజానికి మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన ఎలాహి మహల్‌లో భాగంగా ఉంది, ”అని డెక్కన్ ఆర్కైవ్‌ను నడుపుతున్న మరియు హైదరాబాద్ గురించి వ్రాసే Md. సిభగతుల్లా ఖాన్ అన్నారు.




హైదరాబాద్‌లోని నాల్-ఎ-ముబారక్ అషుర్ఖానా ప్రవేశం. (ఫోటో: Siasat.com/Md. సిబ్ఘతుల్లా ఖాన్)

 నాల్-ఎ-ముబారక్ మొదట రాజభవనం అయిన ఇలాహి మహల్‌లో ఉంచబడిందని చారిత్రక రికార్డులు వివరిస్తున్నాయి. ఇది హైదరాబాద్ స్థాపకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా (1580-1611) పాలనలో గుల్జార్ హౌస్ సమీపంలో ఉంది. నాల్-ఎ-ముబారక్ తరువాత పత్తర్‌గట్టి వద్ద ఉన్న ప్రస్తుత ప్రదేశానికి మార్చబడింది మరియు అప్పటి నుండి అక్కడ కొనసాగించబడింది.

మొహర్రం నెల మొదటి పది రోజులలో, నాల్-ఎ-ముబారక్ వద్ద ఉన్న ఆలం ప్రజలకు తెరిచి ఉంచబడుతుంది. మొహర్రం తొమ్మిదవ రోజున, ఇది నగరం చుట్టూ తిరుగుతుంది. నిజాం శకం (1724-1948)లో, పూర్వ హైదరాబాద్ రాష్ట్ర మాజీ ప్రధానమంత్రి అయిన మహారాజా కిషన్ పెర్షాద్ తన నివాసంలో ఆలంకు నజరానా (సమర్పణ) ఇచ్చేవారు. ఊరేగింపులో అతను చెప్పులు లేకుండా నడిచేవాడని చరిత్రకారులు చెబుతున్నారు.

మొహర్రం తొమ్మిదో రోజు నల్-ఎ-ముబారక్ అషుర్ఖానా నుండి బయటకు తీసిన తర్వాత జరిగే ఊరేగింపులో వేలాది మంది ప్రజలు పాల్గొంటారు. ఈ ఊరేగింపు పత్తర్‌గట్టి, గుల్జార్ హౌజ్, చార్మినార్, షహలీబండ, దైరా మీర్ మోమిన్, సుల్తాన్ షాహి మరియు తల్లాబ్‌కట్ట మరియు దాటి వెళుతుంది.

 

మూల రచన:షైస్తా ఖాన్, తెలుగు సేత: సల్మాన్ హైదర్ 

No comments:

Post a Comment