25 August 2022

ప్రతిరోజూ పఠించవలసిన దివ్య ఖురాన్ లోని 7 సూరాలు 7 Surahs of the Holy Quran to Recite Everyday

 

విశ్వాసులు ప్రతి రోజు దివ్య ఖురాన్‌ను పఠిస్తారు.దివ్య ఖురాన్ లో మన  స్వీయ-అభివృద్ధి కోసం పఠించాల్సిన అనేక చిన్న సూరాలు ఉన్నాయి.మనము  ప్రతిరోజూ పఠించవలసిన  మరియు అల్లాహ్ యొక్క అనంతమైన ఆశీర్వాదాలను పొందటానికి  ఉపయోగపడే దివ్య ఖురాన్ లోని 7 సూరాలను మీతో పంచుకుంటున్నాను.

పవిత్ర ఖురాన్ చదవడం వలన మనశ్శాంతి మరియు ఆత్మ యొక్క అంతర్గత శాంతిని పొందుతాము అని పవిత్ర ఖురాన్ మరియు హదీసులలో వివరించబడినది.  కాబట్టి పవిత్ర ఖురాన్ పఠనంలో ఎప్పుడూ వెనుకబడి ఉండకండి.

జీవితంలో, మనం తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటాము. కష్ట సమయంలో, మన మనస్సు, హృదయం మరియు ఆత్మను ప్రకాశవంతం చేసే పవిత్ర ఖురాన్ చదవడం అలవాటు చేసుకోండి.

సూరా అల్ ఫాతిహా, అయతుల్ కుర్సీ (అల్ బఖరా 255వ  ఆయత్ ), సూరా అల్ బఖరా  284 -286 ఆయతులు మరియు సూరా అల్ కౌసర్‌లను చదవడం దినచర్యగా చేసుకోండి.

ఐదు ప్రార్థనల తర్వాత చదవడానికి దివ్య ఖురాన్ సూరాలు:

నిండు మనస్సు తో చదివితే పవిత్ర ఖురాన్‌ను పఠించడం ఎల్లప్పుడూ సులభతరం అవుతుంది. ప్రార్థనలు చేసిన వెంటనే పవిత్ర ఖురాన్ యొక్క సూరాలను పఠించడo  ఒక అలవాటుగా  చేసుకోండి. ప్రతి ప్రార్థన తర్వాత, ఈ క్రింది క్రమంలో మొదట సూరా అల్ ఫాతిహా (1:1-7) ఆపై అయతుల్ కుర్సీ (2:255) చదవండి.

ఫజ్ర్ నమాజ్ తర్వాత అయతుల్ కుర్సీ చదివినవారిని జన్నాలోకి ప్రవేశించకుండా ఎవరూ ఆపలేరు. ఆ తర్వాత, ఇబ్బందుల నుండి ఉపశమనం పొందడానికి సూరా అన్ నస్ర్ (110: 1-3) చదవండి. ప్రార్థన తర్వాత ప్రతిరోజూ 7 సార్లు ఈ సూరాను చదవడం అలవాటు చేసుకోండి.

ఫజ్ర్ ప్రార్థన చేసిన తర్వాత సూరా ఫజ్ర్ చదవండి, ఎందుకంటే ఇది ఆందోళన మరియు అన్ని చింతలను తగ్గిస్తుంది. సూరా యాసీన్ (36: 1-83) చదివితే మీ రోజు బాగుంటుంది మరియు మీరు కోరుకునే ప్రతిదీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ద్వారా నెరవేరుతుంది. సూరా అస్ర్ పఠించండి, తద్వారా మీకు సహనం మరియు న్యాయం కోసం నిలబడే సామర్థ్యం ఉంటుంది.అంతే కాదు, దైనందిన జీవితంలో ప్రయోజనాలను పొందేందుకు పఠించవలసిన  సూరాలు చాలా ఉన్నాయి. పవిత్ర ఖురాన్ చదవడం ప్రారంభించిన తర్వాత మీరు ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు దగ్గరగా ఉంటారు.

ఇక్కడ దివ్య ఖురాన్ లోని కొన్ని సూరాలకు సంబంధించిన  ప్రయోజనాలు మరియు వివరణలు ఇవ్వబడ్డాయి.

 

1.  సూరా అల్-ఫాతిహా (1:1-7):

పవిత్ర ఖురాన్‌లోని ముఖ్యమైన 7 సూరాలలో ఒకటి సూరా అల్-ఫాతిహా. ఇది పవిత్ర ఖురాన్ యొక్క ప్రారంభ సూరా మరియు దీనికి విభిన్న అర్థాలతో అనేక పేర్లు ఉన్నాయి. దీనిని అల్-ఫాతిహా, ఉమ్-అల్ ఖురాన్, సబ్‌ఉల్ మథానీ, అల్-హమ్ద్,  అస్-సలాహ్, అష్-షిఫా, అసస్ అల్-ఖురాన్ అని కూడా పిలుస్తారు. సూరా అల్ ఫాతిహా లో చాలా సద్గుణాలు కలవు.

 2. సూరా అల్-కహ్ఫ్ (18: 1-110):

మన ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు:

"శుక్రవారం నాడు ఎవరైతే సూరత్ అల్-కహ్ఫ్‌ను చదువుతారో వారికి అది రెండు శుక్రవారాల మధ్య కాలానికి వెలుగునిస్తుంది."(సహీ ముస్లిం)

అలాగే, తఫ్సీర్ ఇబ్న్ కథిర్ ఇలా పేర్కొన్నాడు "సూరత్ అల్-కహ్ఫ్‌లోని మొదటి పది ఆయతులను చదివి, కంఠస్థం చేసే వారు అల్-దజ్జాల్ యొక్క ఫిత్నా  నుండి రక్షించబడతారు."

3. సూరా అల్-ముల్క్ (67: 1-30):

పవిత్ర ఖురాన్‌లో ప్రస్తావించబడిన సూరా అల్ ముల్క్ లో గొప్ప విశేషాలు ఉన్నాయి.

ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా పేర్కొన్నారు:

దివ్య ఖురాన్‌లో కేవలం ముప్పై ఆయతులతో కూడిన సూరా ఉంది. ఎవరైతే పఠించారో వారిని స్వర్గంలో చేర్చే వరకు అది వారిని రక్షించును.

సూరా ముల్క్ సమాధి ఒత్తిడి నుండి మనిషికి రక్షకునిగా ఉంటుంది. కాబట్టి ఇషా నమాజు తర్వాత చదవండి.

 4. సూరా అల్-కాఫిరున్ (109: 1-6):

ప్రతిరోజూ సూరా అల్ కాఫిరూన్ పఠించడానికి సమయం కేటాయించండి. ఇది షిర్క్ నుండి మనలను కాపాడుతుంది మరియు రక్షిస్తుంది. షిర్క్ అనేది విగ్రహారాధన లేదా బహుదేవతారాధన చేసే పాపంగా నిర్వచించబడింది.

ఫజర్ ప్రార్థన తర్వాత సూరా అల్ కాఫిరూన్ సూరాను పఠించడం వల్ల మీ మనస్సు చెడు ఆలోచనల నుండి శుభ్రపడుతుంది మరియు మీరు తేడాను అనుభవిస్తారు. ప్రతిరోజూ 11 సార్లు పఠించడానికి ప్రయత్నించండి.

5. దివ్య ఖురాన్ యొక్క మూడు కుల్స్:

మూడు కుల్స్ (అన్ నాస్ (114: 1-6), అల్ ఫలాక్ (113: 1-5), మరియు అల్ ఇఖ్లాస్ (112: 1-4)) వాటిని "మువాజాతైన్" అని కూడా అంటారు. వాటిని ప్రతిరోజూ పఠించడం వల్ల ఎక్కువ ప్రాముఖ్యత మరియు ప్రతిఫలం లభిస్తుంది.

ఆయిషా (R.A.) ద్వారా వివరించబడింది:ప్రవక్త నిద్ర పోయేముందు, సూరత్ అల్-ఇఖ్లాస్, సూరత్ అల్-ఫలాక్ మరియు సూరత్ అన్ననాస్ చదివిన తర్వాత తన చేతులను ఒకదానితో ఒకటి కప్పి, వాటిపై ఊదేవారు, ఆపై తన శరీరంలోని అన్ని భాగాలపైనా చేతులతో  రుద్దేవారు. ముందు తల, ముఖం మరియు శరీరం ముందుభాగంతో ప్రారంభించి రుద్దేవారు.ఆ విధంగా మూడుసార్లు అలా చేసేవారు.(సహీహ్ అల్-బుఖారీ).

ప్రతిరోజూ ఈ సూరాలను పఠించడం వల్ల మనం నిద్రలో మరియు మేల్కొని ఉన్నప్పుడు అన్ని చెడుల   నుండి రక్షించబడవచ్చు.

 6.  సూరా అల్ వాకియా (56: 1-96):

ప్రతిరోజూ మగ్రిబ్ ప్రార్థన తర్వాత సూరా అల్ వాకియా చదవండి. ఈ సూరాను పఠించడం వల్ల మీకు (సంపద) రిజ్క్ వస్తుంది మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి ప్రతిఫలం లభిస్తుంది.

7. అయత్ అల్-కుర్సీ (2: 255):

అయతుల్ అల్-కుర్సీ పవిత్ర ఖురాన్ యొక్క అత్యంత ముఖ్యమైన ఆయతులలో ఒకటి. ఇది సూరా అల్ బఖరా 255లో కనిపిస్తుంది.

అబూ హురైరా (ర) ఇలా నివేదించారు.'అయత్ అల్-కుర్సీని పూర్తిగా చదవండి. అల్లాహ్ మీపై సంరక్షకుడుగా  ఉన్నాడు మరియు షైతాన్ మిమ్మల్లి ఏమి చేయలేడు. (సహీహ్ అల్-బుఖారీ).

ఇవి పవిత్ర ఖురాన్‌లోని 7 సూరాలు, మీరు ప్రతిరోజూ పఠించడం అలవాటు చేసుకోవాలి. పవిత్ర ఖురాన్ పఠనం మిమ్మల్ని సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది.

 

No comments:

Post a Comment