6 August 2022

ముసా మరియు గొర్రెల కాపరి - (రూమి) Moses and the Shepherd - (Rumi)

 దారిలో ఒక గొర్రెల కాపరి ఇలా ప్రార్థించడం ముసా విన్నాడు.

దేవుడా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నీ చెప్పులు  బాగుచేస్తాను,  నీ జుట్టును దువ్వుతాను. నేను నీ బట్టలు ఉతకాలి అనుకొoటున్నాను మరియు నీ తలలో  పేలు ఏరాలని అనుకొటున్నాను. నేను నీకు పాలు తీసుకురావాలనుకుంటున్నాను, నువ్వు పడుకునే సమయం ఆసన్నమైనప్పుడు నీ చిన్ని చేతులు మరియు కాళ్లను ముద్దాడాలని అనుకొంటున్నాను.. నేను నీ  గదిని తుడిచి చక్కగా ఉంచాలనుకుంటున్నాను. దేవా!నా గొర్రెలు మరియు మేకలు నీవి.

నిన్ను స్మరించుకుంటూ నేను చెప్పగలను, ఆయ్, ఆయ్."

ముసా  ఇక తట్టుకోలేకపోయాడు.

" నీవు ఎవరితో మాట్లాడుతున్నావు?"

"మనల్లి సృష్టించినవాడు, భూమిని సృష్టించాడు మరియు ఆకాశాన్ని సృష్టించాడు."

దేవునితో చెప్పుల గురించి మాట్లాడకు!

అలాగే చిన్న చేతులు మరియు కాళ్ళు ముద్దాడటం! ఏమిటి?

అలాంటి పాడు మాటలు మాట్లాడకు?,

నీవు నీ అమ్మానాన్నలతో మాట్లాడుతున్నావా ఏమిటి ?

పెరిగే వాటికి మాత్రమే పాలు కావాలి.

పాదాలు ఉన్న వ్యక్తికి మాత్రమే చెప్పులు అవసరం. దేవునికి  కాదు!

పైగా 'నేను అనారోగ్యంతో ఉన్నాను,మీరు నన్ను సందర్శించలేదు' అని దేవుడు అన్నట్లు మాట్లాడుతున్నావు.  నీవు సరిగా మాట్లాడటం నేర్చుకో?

మంచి మాటలు మాట్లాడు! అల్లాను అలా పిలువ రాదు.

ఫాతిమా అనేది స్త్రీకి మంచి పేరు, కానీ నీవు మగాడిని ఫాతిమా అని పిలిస్తే,

అది ఒక అవమానం.

 

గొర్రెల కాపరి పశ్చాత్తాపపడి తన బట్టలు చించుకుని నిట్టూర్చి ఎడారిలోకి వెళ్లాడు.

అకస్మాత్తుగా మోషేకు ఒక ద్యోతకం వచ్చింది. దేవుని స్వరం: “మీరు నన్ను నా వారి  నుండి వేరు చేసారు. నువ్వు ప్రవక్తగా వచ్చింది  ఏకం చేయడానికా లేదా విడదీయడానికా ? నేను ప్రతి జీవికి  జ్ఞానాన్ని చూడడానికి, తెలుసుకోవటానికి మరియు చెప్పడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఇచ్చాను.మీకు ఏది తప్పుగా అనిపిస్తుందో అది అతనికి సరైనది. అది ఒకరికి విషం, మరొకరికి తేనె.పవిత్రత మరియు అపవిత్రత, ఆరాధనలో బద్ధకం మరియు శ్రద్ధ, ఇవి నాకు ఏమీ అర్థం కావు.నేను వాటన్నింటికీ దూరంగా ఉన్నాను.ఆరాధన యొక్క మార్గాలు  మంచివి లేదా అధ్వాన్నమైనవిగా పరిగణించబడవు.హిందువులు, హిందూ పనులు చేస్తారు. భారతదేశంలోని ద్రావిడ ముస్లింలు తమకు ఇష్టం వచ్చినది చేస్తారు.ఇవి అన్ని ప్రశంసలు, మరియు ఇవి సరైనవి.పూజా కార్యక్రమాలలో కీర్తించబడేది నేను కాదు.ది భక్తులే! నాకు మాటలు వినిపించడం లేదు.వాళ్ళు చెప్తారు. నేను వారిలోని వినయాన్ని చూస్తున్నాను.దైవబీతి, దేవుని పట్ల అణకువ అనేది వాస్తవికత, భాష, పదజాలాన్ని విస్మరించండి.

నాకు విశ్వాసుల ఆవేదన కావాలి!విశ్వాసులతో స్నేహంగా ఉండండి, మీ ఆలోచనలను మరియు మీ వ్యక్తీకరణ రూపాలను మార్చుకొండి!

ముసా! ఆలోచన మరియు మాట్లాడే మార్గాలపై శ్రద్ధ చూపే వారు ఒకరకంగా ఉంటారు.విశ్వాసులు వేరే రకంగా ఉంటారు.కాలిపోయిన గ్రామంపై ఆస్తి పన్ను విధించవద్దు. దైవ ప్రేమికుడిని తిట్టవద్దు.

ఇతరుల వంద సరియైనమార్గాల కంటే భక్తుడు మాట్లాడే తప్పుమార్గం మంచిది.మీ ప్రార్ధన ఏ దిశను సూచిస్తున్నదో నాకు  పట్టింపు లేదు

సముద్రపు లో ఈత వేసేవానికి  చెప్పులు అవసరం లేదు!ప్రేమ-మతానికి నిభందనలు లేదా సిద్ధాంతం లేదు. దేవుడు మాత్రమే ప్రధానం..

మాణిక్యంపై ఏమీ చెక్కలేదు!దీనికి గుర్తులు అవసరం లేదు.”

దేవుడు ముసా తో లోతైన రహస్యాలు చెప్పడం ప్రారంభించాడు. “. భక్తుడు తనను వదిలేసి, దేవుని కోసం అనంతలోకానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఇలా చాలా సార్లు ఇలా జరిగింది.దీనిని గురించి నేను చెప్పడం అవివేకం.నేను చెబితే, అది మానవ మేధస్సును నిర్మూలిస్తుంది.రాసే కలాలను పాడు చేస్తుంది.”

ముసా  గొర్రెల కాపరిని వెంబడించాడు.

“అతని వంకర టింకర పాదముద్రలను అనుసరించాడు,అవి ఒక చోట నేరుగా కదులుతున్నవి.. మరొక చోట పక్కకి వెళుతున్నాయి. కొన్ని సార్లు కెరటం లాగా ఎగురుతున్నవి, మరికొన్ని సార్లు చేపలా కిందకి జారిపోతున్నవి., ఎల్లప్పుడూ అతని పాదాలు ఇసుకలో చిహ్నాలను చేస్తూ, అతని సంచరించే స్థితిని తెలియ  చేస్తున్నాయి.”

చివరకు మోషే అతనిని పట్టుకున్నాడు.

"నాదే పొరపాటు. ఆరాధనకు ఎటువంటి నియమాలు లేవని దేవుడు నాకు వెల్లడించాడు. మీ ప్రేమ మీకు ఏది చెబితే అది చెప్పండి. నీ మాటే నిజమైన భక్తి. నీ ద్వారా ప్రపంచం మొత్తం విముక్తి పొందింది.నీవు మాట్లాడు  మరియు ఏమి బయటకు వస్తుందో అని  చింతించకు.అది ఆత్మ యొక్క కాంతి."

గొర్రెల కాపరి బదులిచ్చాడు,

ముసా, ఓ ముసా! నేను భాదపడటం లేదు..

మీరు కొరడాను ప్రయోగించారు మరియు నా గుర్రం భయపడి దూకింది.

దైవిక స్వభావం మరియు నా మానవ స్వభావం కలిసి వచ్చాయి.

మీ తిట్టే చేతిని ఆశీర్వదించండి.

ఏం జరిగిందో నేను చెప్పలేను. నా వాస్తవ పరిస్థితి మీకు  చెప్పలేను."

కాపరి నిశ్శబ్దంగా ఉన్నాడు.

“మీరు అద్దంలో చూసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు చూస్తారు, అద్దం యొక్క స్థితి కాదు. వేణువు వాయించేవాడు వేణువులో ఊపిరి పోస్తాడు మరియు సంగీతాన్ని ఎవరు చేస్తారు? వేణువు కాదు. వేణువు ఊదేవాడు.!

మీరు దేవునికి స్తుతించినప్పుడల్లా లేదా కృతజ్ఞతలు తెలిపినప్పుడల్లా, అది ఎల్లప్పుడూ ఈ గొర్రెల కాపరి యొక్క సరళత వలె ఉంటుంది.

మీరు “చివరికి ముసుగులు తొలగించి  చూసినప్పుడు, మీరు ఇది ఖచ్చితంగా మనం అనుకున్నట్లు కాదు” అని మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటారు,

 

No comments:

Post a Comment