2 August 2022

నిజాం యొక్క విమానాల బహుమతి 1940లో నాజీ జర్మనీని ఓడించడానికి బ్రిటన్ కు సహాయపడింది Nizam’s gift of aircrafts helped Britain defeat Nazi Germany in 1940

 


 

జూలై 1940లో, బ్రిటన్ యుద్ధం అని పిలువబడే రెండవ ప్రపంచ యుద్ధం యొక్క అత్యంత కీలకమైన యుద్ధాలలో ఒకటి ప్రారంభమైంది. నాజీ జర్మనీ యొక్క వైమానిక దళం (లుఫ్ట్‌వాఫ్ఫ్ Luftwaffe) చేసిన భారీ-స్థాయి దాడులకు వ్యతిరేకంగా గ్రేట్ బ్రిటన్ యొక్క రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF) తన దేశాన్ని రక్షించుకోవడం కోసం ఎదురు దాడులు ప్రారంభించినది. రెండు శత్రు దేశాల వైమానిక దళాలు పూర్తిగా పోరాడిన మొదటి ప్రధాన సైనిక యుద్ధంగా ఇది వర్ణించబడింది. అధిక సంఖ్యలో ఉన్న RAF పైలట్‌లు ధైర్యంగా పోరాడారు మరియు అనేక నెలల తీవ్రమైన యుద్ధం తర్వాత లుఫ్ట్‌వాఫ్ఫ్( నాజీ జర్మనీ యొక్క వైమానిక దళం) యొక్క అత్యున్నత బలగాలను అధిగమించేందుకు అధిక సంఖ్యలో వైమానిక దాడులను నిర్వహించారు.  

అయితే పెద్దగా తెలియని విషయం ఏమిటంటే, హైదరాబాద్ నిజాం ఏరో విమానాల తయారీ కోసం గ్రేట్ బ్రిటన్‌కు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చాడు మరియు ఈ విమానాలు యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. నిజాం మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే బ్రిటన్‌కు ఏరో విమానాలను మరియు పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. నిజాం నిధులు సమకూర్చిన విమానాలను స్క్వాడ్రన్స్ 110, 152 మరియు 253 సంఖ్యలతో మూడు యూనిట్లుగా విభజించారు. నిజాం పోషకుడిగా ఉన్నందున, వీటిని హైదరాబాద్ స్క్వాడ్రన్‌లుగా పిలిచారు మరియు హైదరాబాద్ స్క్వాడ్రన్‌ బ్యానర్‌లో పనిచేసిన పైలట్లు యుద్ధంలో వారి శౌర్యం మరియు త్యాగాలకు ప్రసిద్ధి చెందారు.

110 హైదరాబాద్ స్క్వాడ్రన్ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బాంబర్ స్క్వాడ్రన్‌గా ఏర్పడింది. విమానాలు హైదరాబాదు నిజాం బహుమతి మరియు ప్రతి విమానం ఆ బహుమతి సంబంధించిన శాసనాన్ని inscription కలిగి ఉంది. ఈ యూనిట్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో మొదటి హైదరాబాద్ స్క్వాడ్రన్‌గా పేరు పొందింది.

 హైదరాబాద్ స్క్వాడ్రన్ రెండవ ప్రపంచ యుద్ధంలో మొదట ట్రాన్స్‌పోర్ట్ స్క్వాడ్రన్‌గా తర్వాత బాంబర్ స్క్వాడ్రన్‌గా మరియు తరువాత హెలికాప్టర్ స్క్వాడ్రన్‌గా పునర్వ్యవస్థీకరించబడింది మరియు  1971లో రద్దు disbanded చేయబడింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, స్క్వాడ్రన్ ప్రధానంగా ప్రారంభ సమయంలో యుద్ధంలో భాగం గా షిప్పింగ్ వ్యతిరేక దాడుల్లో anti-shipping strikes పాల్గొంది..

ప్రతి స్క్వాడ్రన్‌కు దాని స్వంత బ్యాడ్జ్ ఉంది. 152 స్క్వాడ్రన్ బ్యాడ్జ్‌లో బ్రిటీష్ చక్రవర్తి కిరీటంతో పాటు హైదరాబాద్ నిజాం హెడ్ గేర్ మధ్యలో ఉంది. బ్యాడ్జ్‌పై "విశ్వసనీయ మిత్రుడు" అనే నినాదం చెక్కబడింది.

152 హైదరాబాద్ స్క్వాడ్రన్‌లో పనిచేస్తున్న అధికారి ప్రకారం, 1వ ప్రపంచ యుద్ధం ముగిసిన కొద్దిసేపటికే యూనిట్ రద్దు చేయబడింది. అయితే ఇది మళ్లీ అక్టోబర్ 1, 1939న ఆక్లింగ్టన్ ఎయిర్‌ఫీల్డ్ (UK)లో ఫైటర్ స్క్వాడ్రన్‌గా సమావేశమైంది. ఈ స్క్వాడ్రన్ యొక్క విమానాన్ని సులభంగా గుర్తించవచ్చు, ఎందుకంటే వాటి వైపులా sides ఒక నల్ల చిరుతపులితో దూకుతున్న గుండ్రని చిహ్నం ఉంది. ఈ విమానాలను నడిపిన పైలట్లకు బ్లాక్ పాంథర్స్ అని మారుపేరు పెట్టారు మరియు వారి విమానాలను కూడా పాంథర్స్ అని పిలుస్తారు.

డిసెంబరు 1943లో, స్క్వాడ్రన్ లీడర్ మెర్విన్ ఇంగ్రామ్ ఆధ్వర్యంలో, 152 స్క్వాడ్రన్ బర్మాకు తరలివెళ్లింది మరియు అది 1945లో బర్మా పై అంతిమ విజయం సమయంలో బ్రిటిష్ సైన్యానికి వైమానిక దాడులతో మద్దతు ఇచ్చింది.

253 హైదరాబాద్ స్క్వాడ్రన్ యుద్ధం యొక్క మధ్యధరా థియేటర్‌లో శత్రువులను ఎదుర్కోవటానికి ముందు ఫ్రాన్స్ యుద్ధం మరియు బ్రిటన్ యుద్ధంలో పాల్గొంది. ఒక స్క్వాడ్రన్ బ్యాడ్జ్ సృష్టించబడింది, ఇది మొఘల్ కవచాన్ని ధరించి, చేతిలో భారతీయ యుద్ధ గొడ్డలిని పట్టుకున్న చేయి వెనుక భాగం యొక్క హెరాల్డిక్ రూపాన్ని చూపుతుంది. మోటో కింద: "ఒకరు రండి, అందరూ రండి Come One, Come All." అని ఉంది

ఈ చిహ్నాన్ని నిజాం స్వయంగా సూచించి ఆమోదించారు.

బ్రిటన్ యుద్ధంలో 500 మందికి పైగా ధైర్యవంతులైన యువ పైలట్లు తమ ప్రాణాలను అర్పించారు మరియు వారిలో చాలా మంది హైదరాబాద్ స్క్వాడ్రన్‌లకు చెందినవారు. బ్రిటన్ యుద్ధంలో పోరాడిన సింహహృదయ పైలట్‌ల గురించి మాట్లాడుతూ, బ్రిటీష్ ప్రధాన మంత్రి సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇలా అన్నారు: "మానవ సంఘర్షణ రంగంలో ఎన్నడూ లేనంతగా చాలా మంది కొద్ది  మందికి రుణపడి ఉన్నారు." నిజంగా ఇది జులై, 1940 నుండి మే 1941 వరకు సాగిన చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన ఎపిక్ బాటిల్.

హైదరాబాద్ నిజాం నిధులు సమకూర్చిన విమానాలు రెండవ ప్రపంచ యుద్ధంలో అత్యంత ప్రసిద్ధి చెందిన యుద్ధాలలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.

నిజాం విరాళంగా ఇచ్చిన విమానాలలో ఒకటి మాత్రమే ఈ రోజు మిగిలి ఉంది. ఇది UKలోని రాయల్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో ప్రదర్శించబడింది. నిజాం బ్రిటన్‌కు కానుకగా ఇచ్చిన ఏరో విమానం ఒకటి హైదరాబాద్‌లో కూడా ప్రదర్శనకు ఉంచి ఉంటే అద్భుతంగా ఉండేది. ఇప్పటి తరానికి తెలిసేది, వారి జనరల్ నాలెడ్జ్ పెరిగేది, ఆ విమానాలను నడిపిన అరివీర భయంకరమైన పైలట్ల గురించి విని, వారి విజయం, ఘనత హైదరాబాద్ పౌరులకు తెలిసి ఉండేది. దురదృష్టవశాత్తు, అది జరగలేదు మరియు ఆ సమాచారం మొత్తం తెలియదు.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రచురించబడిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో పౌర మరియు సైనిక విమానయానానికి నగరం అందించిన సహకారానికి గుర్తుగా హైదరాబాద్‌లో ఏవియేషన్ మ్యూజియం నిర్మించాలని విమానయాన ప్రియులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హైదరాబాద్‌లో ఇతర భారతీయ నగరాల కంటే చాలా సంవత్సరాల ముందు బేగంపేట మరియు హకీంపేటలలో విమానయాన శిక్షణ అకాడమీలు ఉన్నాయి. కానీ ఈ రంగం చూసిన ప్రారంభ ప్రేరణ తరువాత క్షీణించింది మరియు భారతదేశంలోని ప్రముఖ విమానయాన కేంద్రంగా హైదరాబాద్‌కు ఉన్న సామర్థ్యం నెరవేరలేదు.

మూల రచయిత:అభిజిత్ సేన్ గుప్తా

తెలుగు సేత: సల్మాన్ హైదర్

 

No comments:

Post a Comment