15 August 2022

భారత స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు నిర్వహించిన గొప్ప పాత్ర Glorious Role of Muslims in Indian Freedom Struggle

 





"భారతదేశంలోని ముసల్మాన్‌లు భారతదేశంలోని బ్రిటీష్ అధికారానికి దీర్ఘకాలిక ప్రమాదానికి మూలంగా ఉన్నారు మరియు చాలా సంవత్సరాలుగా ఉన్నారు." భారతదేశంలో నియమితుడు అయిన  ఒక ఆంగ్ల అధికారి డబ్ల్యూ డబ్ల్యూ హంటర్, 1871లో ప్రచురించబడిన తన ప్రసిద్ధ పుస్తకం ది ఇండియన్ ముసల్మాన్స్లో.

1947 తర్వాత, భారతీయ పండితులు భారత స్వాతంత్ర్య పోరాట  చరిత్రలో  ముస్లింలను మినహాయించారు. గత ఏడు దశాబ్దాలుగా, ముస్లింల సహకారాన్ని పెద్దగా పట్టించుకోని భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను మనం చదువుతున్నాం. ఈ కథనంపై పెరిగిన తరాలు భారతీయ ముస్లింలు బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారని లేదా స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉన్నారని నమ్ముతారు.

ఈ సోషల్ మీడియా యుగంలో, స్వాతంత్ర్య పోరాటంపై ఈ తప్పుడు అవగాహన ఆధారంగా భారతీయ ముస్లింల దేశభక్తిని ప్రశ్నించే వ్యక్తులను మనం చూస్తున్నాము. నిజానికి, 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన డిక్షనరీ ఆఫ్ మార్టిర్స్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ (1857-1947) Dictionary of Martyrs of India’s Freedom Struggle (1857-1947)’లో పేర్కొన్న మొత్తం అమరవీరుల్లో దాదాపు 30% మంది ముస్లింలు. 1857కి ముందు ముస్లిం అమరవీరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని కాని డిక్షనరీ వారిని లెక్కలోకి తీసుకోలేదని మనం గమనించాలి.

చరిత్ర పేరుతో ప్రచారం చేస్తున్న ఇలాంటి అబద్ధాలను సవాలు చేయాలి. భారతదేశంలోని బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని మొదటి నుండి భారతీయులు ప్రతిఘటించారు మరియు ముస్లింలు ఈ ప్రతిఘటనలో ముందు ఉన్నారు.

1వ భాగం:1757-1805

ప్లాసీ యుద్ధం (1757) మరియు బక్సర్ యుద్ధం (1764) తర్వాత బ్రిటిష్ వారు బెంగాల్‌ను పరిపాలనాపరంగా మరియు ఆర్థికంగా స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ నవాబుపై విజయం సాధించడంతో, బ్రిటిష్ వారు బెంగాల్ ప్రావిన్స్‌లోని భారతీయులను దోపిడీ చేయడం ప్రారంభించారు. వారి క్రూరమైన దోపిడీ ఫలితంగా 1770లో కరువు ఏర్పడింది, ఇది బెంగాల్ మొత్తం జనాభాలో మూడింట ఒక వంతు మంది మరణానికి కారణమైంది.

 

విదేశీ వలస పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదటి జాతీయ ప్రతిఘటన బెంగాల్‌లో తలెత్తడంలో ఆశ్చర్యం లేదు. హిందూ సన్యాసీలు మరియు ముస్లిం ఫకీర్ల ఐక్య ఫ్రంట్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాడింది.. ఈ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తి, మజ్ను షా, కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)కి చెందిన ఒక ముస్లిం సూఫీ. మజ్ను కాన్పూర్‌లోని షా మదర్‌కు భక్తుడు మరియు మరొక సూఫీ సన్యాసి హమీదుద్దీన్ సలహా మేరకు పేద రైతుల కోసం ఉద్యమించాడు. దాదాపు 2000 మంది ఫకీర్లు మరియు సన్యాసీలు, అతని నాయకత్వంలో, పేద దోపిడీకి గురైన ప్రజలకు డబ్బు మరియు ఆహారాన్ని పంచడానికి బ్రిటిష్ మరియు బ్రిటిష్ మద్దతు ఉన్న భూస్వాముల నిధులను దోచుకున్నారు. 1763 నుండి 1786లో మరణించే వరకు మజ్ను భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా ఉన్నాడు.. ఫకీర్ మరియు సన్యాసి దళాలు గెరిల్లా యుద్ధాలలో బ్రిటిష్ వారి అనేక మంది అధికారులను మరియు సైనికులను చంపాయి. మజ్ను మరణం తరువాత, మూసా షా ఉద్యమానికి నాయకత్వం వహించాడు. భవానీ పాఠక్ వంటి హిందూ సన్యాసి నాయకులు అతనితో కలిసి పోరాడారు, అయితే వలసరాజ్యాల రికార్డులు మజ్నుని అత్యంత ప్రమాదకరమైన నాయకుడిగా పరిగణించాయి ఎందుకంటే మజ్ను ఆధ్వర్యంలో హిందువులు మరియు ముస్లింలు ఐక్యంగా యుద్ధం చేశారు. బ్రిటిష్ వారు మజ్ను మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఉద్యమాన్ని అణచివేశారు కానీ జాతీయవాద స్ఫూర్తిని అణచలేకపోయారు.

 

బెంగాల్‌లో ఫకీర్ల నేతృత్వంలోని ఉద్యమాన్ని బ్రిటిష్ వారు క్రురంగా అణచివేయడం వల్ల ఫకీర్లు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు మరియు 18వ శతాబ్దం ప్రారంభంలో మరాఠాలు మరియు ఇతర బ్రిటిష్ వ్యతిరేక దళాలలో చేరారు.

2వ భాగం : 1806-1857.

1806లో వెల్లూరులో ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీ సైన్యానికి చెందిన భారతీయ సిపాయిలు జరిపిన మొదటి పెద్ద తిరుగుబాటు, 1857 తిరుగుబాటు కు వెనుక ప్రేరణగా చెప్పబడుతున్నది. ఇది  టిప్పు సుల్తాన్ కుమారులు, హోల్కర్లు మరియు హైదరాబాద్ నిజాం సోదరుడు ఫకీర్ల సహాయంతో ప్లాన్ చేశారు.  దక్షిణ భారతదేశంలోని ప్రతి కంటోన్మెంట్‌లో, ఫకీర్లు మతపరమైన ప్రసంగాలు, పాటలు మరియు తోలుబొమ్మల ప్రదర్శనల ద్వారా జాతీయవాద సందేశాన్ని ప్రచారం చేశారు. వెల్లూరుతో సహా అనేక ప్రాంతాల్లో తిరుగుబాటు జరిగినప్పుడు, భారతీయ విప్లవకారులకు షేక్ ఆదమ్, పీర్జాదా, అబ్దుల్లా ఖాన్, నబీ షా మరియు రుస్తమ్ అలీ వంటి ఫకీర్లు నాయకత్వం వహించారు. పండితుడు పెరుమాళ్ చిన్నియన్ ఇలా వ్రాశాడు, “దక్షిణాది కుట్రకు ఫకీర్లు మరియు ఇతర మత గురువులు మద్దతు ఇచ్చారు. అన్ని ఆర్మీ స్టేషన్లలో తిరుగుబాటు కుట్ర వారి ద్వారా జరిగింది..

కొన్ని సంవత్సరాలలో, బ్రిటిష్ వారు సయ్యద్ అహ్మద్ బరేల్వి, హాజీ షరియతుల్లా మరియు టిటు మీర్ నేతృత్వంలోని మూడు విభిన్న ఉద్యమాల రూపంలో మరో సవాలును ఎదుర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన సయ్యద్ అహ్మద్ దేశంలోని అనేక ప్రాంతాలలో పర్యటించారు మరియు బీహార్, బెంగాల్ మరియు మహారాష్ట్రలో అనుచరులను ఏర్పరచుకొన్నారు.. సయ్యద్ అహ్మద్ అనుచరులు ఆఫ్ఘనిస్తాన్ ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో బ్రిటిష్ మరియు దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టారు. దశాబ్దాలపాటు ఈ ఉద్యమం బ్రిటిష్ వారికి సవాలుగా నిలిచింది. బ్రిటిష్ వారు ఈ ఉద్యమాన్ని మతపరమైన మతోన్మాదంగా చిత్రీకరించారు, వాస్తవానికి సయ్యద్ అహ్మద్ విదేశీ పాలకులకు వ్యతిరేకంగా మరాఠాలతో మైత్రిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారు. సయ్యద్ అహ్మద్ 1831లో మరణించిన తర్వాత, పాట్నాకు చెందిన ఇనాయత్ అలీ మరియు విలాయత్ అలీలు ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టారు. సరిహద్దు ప్రాంతంలో వారు నాయకత్వం వహించిన యుద్ధాలు బ్రిటిష్ సైన్యానికి చెందిన వేలాది మంది సైనికుల మరణానికి కారణమయ్యాయి.

హాజీ షరియతుల్లా మరియు అతని కుమారుడు డూడూ మియాన్ Dudu Miyan ధనిక భూస్వాముల దౌర్జన్యాన్ని ఎదిరించేందుకు బెంగాల్‌లో ఆయుధాలు చేపట్టారు. వారు నీలిమందు పెంపకందారులు మరియు ఇతర బ్రిటిష్ ఏజెంట్లకు వ్యతిరేకంగా రైతులను తిరుగుబాటుకు నడిపించారు. వారు నడిపిన ఉద్యమాన్ని ఫరైజీ ఉద్యమం అంటారు

బ్రిటీష్ మద్దతు ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా పేద ప్రజల ఉద్యమానికి టిటు మీర్ నాయకత్వం వహించాడు. టిటు మీర్ తన సైన్యాన్ని ఏర్పాటు చేసి, ప్రజారంజకమైన పరిపాలనను ఏర్పాటు చేశాడు. 1831లో, బ్రిటీష్ వారితో జరిగిన యుద్ధంలో టిటు మరణించాడు. అతని డిప్యూటీ గులాం మాసుమ్‌తో సహా వందలాది మంది మద్దతుదారులను అరెస్టు చేసి ఉరితీశారు.

సయ్యద్ అహ్మద్ ప్రారంభించిన ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు తీవ్రమైన ప్రమాదంగా మిగిలిపోయింది. ఇనాయత్ అలీ, విలాయత్ అలీ, కరామత్ అలీ, జైనుద్దీన్, ఫర్హత్ హుస్సేన్ మరియు ఇతరులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. పాట్నాలో, 1857 తిరుగుబాటు వార్త తెలిసిన వెంటనే, ప్రముఖ నాయకులందరూ అరెస్టు చేయబడ్డారు. అయినప్పటికీ, పీర్ అలీ పాట్నాలో తిరుగుబాటును ప్రారంభించాడు. 1857 తిరుగుబాటు సమయంలో బీహార్‌లో పీర్ అలీ, వారిస్ అలీ మరియు ఇతర ముస్లిం విప్లవకారులు ఉరితీయబడ్డారు.

3వ భాగం:1857ప్రధమ భారత సంగ్రామం:

1857 నాటి జాతీయ స్వాతంత్ర్య మొదటి యుద్ధం వెనుక సుదీర్ఘమైన ప్రణాళికాబద్ధమైన చరిత్ర ఉంది. 1838లో, విదేశీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్త తిరుగుబాటుకు కుట్ర పన్నినందుకు ఆంగ్ల ప్రభుత్వం ముబారిజ్ ఉద్-దౌలాను అరెస్టు చేసింది. రాజా రంజిత్ సింగ్, గైక్వార్స్, సతారా, జోధ్‌పూర్, భోపాల్, పాటియాలా, రోహిల్లా పఠాన్‌లు మరియు పలువురు నవాబులు, రాజాలు మరియు జమీందార్లు ఈ ప్లాన్ లో భాగస్వాములు అని పరిశోధనల్లో వెల్లడైంది. రాజా రంజిత్ సింగ్ నిజానికి ముబారిజ్‌కు సహాయం చేయడానికి తన దళాలను పంపాడు మరియు సహాయం కోసం పర్షియన్ మరియు ఫ్రెంచ్ శక్తులను సంప్రదించాడు. ఈ ప్రణాళిక, కొంతమంది ద్రోహుల కారణంగా బయటపడింది, ముబారిజ్ జైలు పాలయ్యాడు, అక్కడ అతను 1854లో మరణించాడు మరియు రెండు దశాబ్దాల తరువాత తిరుగుబాటు జరిగింది.

 

1845లో మళ్లీ దేశవ్యాప్త స్వాతంత్ర్య సమరానికి ఒక ప్రణాళికను ఆంగ్లేయులు కనుగొన్నారు. ఖ్వాజా హసన్ అలీ ఖాన్, మాలిక్ కదమ్ అలీ, సైఫ్ అలీ మరియు బీహార్ కున్వర్ సింగ్ బహదూర్ షా జాఫర్, సింధియాస్ మరియు నేపాల్ నరేష్ వంటి అనేక రాజకుటుంబాల సహాయంతో విప్లవకారులు పెద్ద సైన్యాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని  కొంతమంది దురాశ పరులైన   వెన్నుబాటుదారులైన భారతీయులు ఆంగ్లేయులకు చెప్పారు

1857 తిరుగుబాటు లో ముస్లింల పాత్ర రహస్యం కాదు. 1857లో హిందువులు మరియు ముస్లింల ఐక్యత బ్రిటిష్ వారిని మునుపెన్నడూ లేని విధంగా కలవర పరిచింది మరియు వారు విభజించి పాలించే విధానాన్ని ఆశ్రయించారు. ఫైజాబాద్‌కు చెందిన మౌల్వీ అహ్మదుల్లా షా, ఖైరాబాదీకి చెందిన ఫజల్-ఎ-హక్, ముజఫర్‌నగర్‌కు చెందిన ఇమ్దాదుల్లా ముహాజిర్ మక్కీ, నానా సాహెబ్ సహచరుడు అజీముల్లా ఖాన్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రచారం చేయడంలో ప్రముఖులు. 1857కి ముందు సంవత్సరాల తరబడి, వారు సిపాయిలతో పాటు పౌరులలో కూడా ఈ ఆలోచనలను ప్రచారం చేశారు.

మీరట్‌లోని సిపాయిలు 10 మే 1857న తమ బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేశారు. ఈ సిపాయిల నాయకులు షేక్ పీర్ అలీ, అమీర్ ఖుద్రత్ అలీ, షేక్ హసన్ ఉద్-దీన్ మరియు షేక్ నూర్ ముహమ్మద్. ప్రారంభంలో తిరుగుబాటు చేసిన 85 మంది సిపాయిలలో సగానికి పైగా ముస్లింలు. సిపాయిలు వెంట పౌరులు కూడా తిరుగుబాటు లో  చేరారు. మరియు విప్లవకారులు ఢిల్లీకి వెళ్లి బహదూర్ షా జాఫర్‌ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఢిల్లీకి విముక్తి లభించింది. లక్నోలో, బేగం హజ్రత్ మహల్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టింది మరియు తిరుగుబాటు సమయంలో సుదీర్ఘ ప్రతిఘటన ఉద్యమానికి నాయకత్వం వహించింది. మౌల్వీ అహ్మదుల్లా కూడా తన బలగాలతో బ్రిటీష్ వారితో పోరాడుతూ యుద్ధంలో వీరమరణం పొందాడు. 1857తిరుగుబాటుపై తన పుస్తకంలో, వీర్ సావర్కర్ అహ్మదుల్లా యొక్క పరాక్రమం మరియు బలిదానం కోసం అనేక పేజీలను అంకితం చేశారు.

ముజఫర్‌నగర్‌లో, ఇమ్దాదుల్లా ఖాసిం నానౌత్వి, రషీద్ గంగోహి మరియు ఇతరులు  ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించి షామ్లీ మరియు థానా భవన్‌లను విడిపించారు. జాతీయ ప్రభుత్వం ఏర్పాటైంది. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో విప్లవకారులు ఓడిపోయారు. ఝజ్జర్ నవాబ్ అబ్దుర్ రెహ్మాన్ కూడా తన మాతృభూమి కోసం పోరాడినందుకు బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డాడు. బ్రిటీష్ రికార్డులు 1857లో వారితో పోరాడిన అనేక మంది ముస్లింలను పేర్కొన్నాయి. ఉదాహరణకు, అజ్ఞాత బురఖా ధరించిన ముస్లిం మహిళ ఢిల్లీలో అరెస్టు కాబడటానికి  ముందు అనేక మంది ఆంగ్ల సైనికులను చేయడానికి చంపింది.

బీహార్‌లో, కున్వర్ సింగ్ 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నాడు. జుల్ఫికర్ అతని అత్యంత విశ్వసనీయ సహచరులలో ఒకడు, జుల్ఫికర్ తో కున్వర్ ప్రతి ప్రణాళిక గురించి చర్చిస్తున్నాడు. అర్రాను విముక్తి చేసిన తర్వాత కున్వర్ స్థాపించిన పౌర ప్రభుత్వం అతని అత్యంత విశ్వసనీయ మిత్రులను కలిగి ఉంది మరియు అనేక మంది ముస్లింలు ఉన్నారు. ప్రభుత్వం "షేక్ గులాం యాహేను మేజిస్ట్రేట్‌గా నియమించింది. అర్రా పట్టణంలోని మిల్కీ టోలా నివాసి అయిన షేక్ ముహమ్మద్ అజీముద్దీన్, తూర్పు ఠాణాకు జమాదార్ (కోశాధికారి)గా నియమితులయ్యారు: దీవాన్ షేక్ అఫ్జల్ కుమారులు తురాబ్ అలీ మరియు ఖాదీమ్ అలీ, కొత్వాల్స్ (నగరానికి బాధ్యత వహించే పోలీసు అధికారులు) గా నియమింప బడినారు.

1857 తిరుగుబాటు విజయవంతం కాలేదు. బహదూర్ షా బర్మాకు బహిష్కరించబడ్డాడు, అనేకమంది ఉరితీయబడ్డారు మరియు చాలా మందిని జీవితాంతం అండమాన్‌ సెల్యులార్ జైలుకు పంపబడినారు.కానీ  భారతీయులలో స్వాతంత్య్ర తృష్ణ చావలేదు.

4వ భాగం:1863-1885:

1863లో, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లోని గిరిజనులు బ్రిటిష్ భూభాగాలపై దాడి చేసి యుద్ధం చేసారు. బ్రిటీష్, విజయం పొందినప్పటికీ కఠినమైన సైనిక సవాళ్లను  ఎదుర్కోవలసి వచ్చింది. బ్రిటిష్ వారు వెయ్యి మందికి పైగా ఆంగ్ల సైనికులను కోల్పోయారు. ఇంటెలిజెన్స్ నివేదికలు అంబాలాలోని ఒక ఫైనాన్షియర్ దీనికి కారణం అని పేర్కొన్నాయి. ఆ ఫైనాన్షియర్ పేరు జాఫర్ తానేశ్రీ. దాడి సమయంలో పోలీసులు NWFPలో యుద్ధానికి ప్రధాన ఫైనాన్షియర్‌గా జాఫర్ తానేశ్రీని రుజువు చేసే  అనేక లేఖలను కనుగొన్నారు. ఫైనాన్షియర్ జాఫర్ తానేశ్రీ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి డబ్బు, మనుషులు మరియు ఆయుధాలను యుద్ధానికి సమకూర్చాడు. పాట్నాకు చెందిన యాహ్యా అలీ మరియు మరో తొమ్మిది మంది పై క్రౌన్/రాణికి వ్యతిరేకంగా యుద్ధం చేసినందుకు అభియోగాలు మోపారు. ఆ తర్వాత భారతదేశం అంతటా వరుస అరెస్టులు మరియు విచారణలు జరిగాయి.

అంబాలా, పాట్నా, మాల్దా, రాజ్‌మహల్‌లలో ప్రజలను అరెస్టు చేశారు. అహ్మదుల్లా, యాహ్యా అలీ, జాఫర్, ఇబ్రహీం మండల్, రఫీక్ మండల్ తదితరులను అరెస్టు చేసి అండమాన్‌కు తరలించారు. 1869లో అమీర్ ఖాన్ మరియు హష్మత్ ఖాన్‌లను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ప్రధాన న్యాయమూర్తి అయిన నార్మన్ వారికి అండమాన్ శిక్ష విధించారు. 1871లో నార్మన్‌ను హత్య చేయడం ద్వారా అబ్దుల్లా ప్రతీకారం తీర్చుకున్నాడు మరియు కొన్ని నెలల తర్వాత షేర్ అలీ అండమాన్‌లో వైస్రాయ్ లార్డ్ మాయోను చంపాడు.

బిపిన్ చంద్ర పాల్, తన ఆత్మకథలో, ఈ విచారణలు మరియు హత్యలు తన రాజకీయ జీవితంపై ఒక ముఖ్యమైన ప్రభావంగా పేర్కొన్నాడు. మరొక ప్రసిద్ధ విప్లవకారుడు, ట్రైలోక్య చక్రవర్తి, "ముస్లిం విప్లవ సోదరులు మాకు మొక్కవోని ధైర్యం మరియు వంచలేని సంకల్పం మరియు వారి తప్పుల నుండి నేర్చుకునే సలహాల గురించి ఆచరణాత్మక పాఠాలు ఇచ్చారు" అని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో, ఇబ్రహీం ఖాన్, అనే రోహిల్లా నాయకుడు మరియు బల్వంత్ ఫడ్కే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. వారు 1860లు మరియు 70లలో బ్రిటిష్ వారికి గట్టి ప్రతిఘటన ఇచ్చారు మరియు దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారిని బెదిరించారు.

5వ భాగం: 1885-1930:

1885లో, భారత దేశం లో అభివృద్ధి చెందుతున్న విద్యావంతులైన మధ్యతరగతి ఆందోళనలను వినిపించేందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బొంబాయి లో (INC) ఏర్పడింది. బద్రుద్దీన్ తయ్యబ్జీ మరియు రహ్మతుల్లా సియానీ ఇద్దరు కాంగ్రెస్ తొలి సభ్యులు మరియు అధ్యక్షులు. తరువాత, M.A అన్సారీ, హకీమ్ అజ్మల్ ఖాన్, హస్రత్ మోహానీ, అబుల్ కలాం ఆజాద్ మరియు ఇతరులు భారతదేశంలోని అతిపెద్ద రాజకీయ సంస్థ కాంగ్రెస్ తో సంబంధం కలిగి ఉన్నారు.

1907లో, పంజాబ్‌లోని రైతులు కాలువ కాలనీల canal colonies కు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. లాలా లజపతిరాయ్ మరియు సర్దార్ అజిత్ సింగ్‌లతో పాటు, సయ్యద్ హైదర్ రజా దాని ప్రముఖ నాయకులలో ఒకరు. ఈ ఉద్యమం తరువాతి గదర్ ఉద్యమానికి నాందిగా పరిగణించబడుతుంది.

మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) సమయంలో బ్రిటిష్ వారు పట్టు గుడ్డపై వ్రాసిన మూడు ఉత్తరాలను  అడ్డగించారు. మౌలానా ఉబైదుల్లా సింధీ మౌలానా మహమూద్ హసన్‌కు రాసిన లేఖలు భారతదేశంలోని బ్రిటిష్ పాలనను పడగొట్టడానికి ప్రపంచవ్యాప్త  ప్రణాళికను సూచిస్తాయి. రౌలట్ కమిటీ నివేదికలో బ్రిటిష్ వారికి అత్యంత ప్రమాదకరమైన భారతీయులలో ఉబైదుల్లా ఒకరిగా పేర్కొనబడ్డారు. ఉబైదుల్లా సాయుధ సమూహాలను ఏర్పాటు చేశాడు, బ్రిటిష్ వ్యతిరేక ఆలోచనలను బోధించాడు మరియు కాబూల్‌లో భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ప్రవాస భారత ప్రభుత్వ ప్రధానమంత్రి మౌలానా బర్కతుల్లా. తాత్కాలిక ప్రభుత్వం వద్ద సైన్యం కూడా ఉండాలి అది సమకూరగానే భారతదేశంపై కాబూల్‌లోని  భారత తాత్కాలిక ప్రభుత్వo  దాడి చేస్తుంది. కానీ, పట్టు పై రాసిన ఉత్తరాలు లీకైనoదువలన  మరియు ప్రపంచ యుద్ధం ముగిసినందున ప్రణాళిక విఫలమైంది. దీనిని సిల్క్ లెటర్ ఉద్యమం అని పిలుస్తారు మరియు 59 మంది స్వాతంత్ర్య సమరయోధులపై అందులో  ఎక్కువగా ముస్లింలపై బ్రిటిష్  సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసినందుకు అభియోగాలు మోపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, అబ్దుల్ బారీ ఫిరంగి మహ్లీ, ఉబైదుల్లా సింధీ, మౌలానా మహమూద్, హుస్సేన్ అహ్మద్ మద్నీ మరియు M.A అన్సారీ వారిలో కొందరు. మౌలానా మహమూద్ మరియు మద్నీలను మక్కాలో అరెస్టు చేసి మాల్టాలోని జైలులో ఉంచారు.

కాంగ్రెస్‌లో  ముస్లిం ముఖం గా కనిపించే మౌలానా అబుల్ కలాం ఆజాద్, బ్రిటిష్ వారు భయపడే స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ విప్లవాల ప్రణాళిక కోసం వివిధ CID నివేదికలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు వచ్చింది. కనీసం 1700 మంది స్వాతంత్ర్య సమరయోధులు ఆజాద్ స్థాపించిన విప్లవాత్మక సంస్థ హిజ్బుల్లాలో సభ్యులుగా స్వేచ్ఛ కోసం చనిపోతారని ప్రమాణం చేశారు. విప్లవాత్మక జాతీయవాద ఆలోచనలను ప్రచారం చేసేoదుకు అల్-హిలాల్ అనే పేపర్ ఆయనచే  ఎడిట్ చేసి ప్రచురించబడింది. అల్-హిలాల్ నిషేదిoపబడినది.  ఆజాద్ వలసవాద వ్యతిరేక ఆలోచనలను ప్రచారం చేయడానికి దారుల్ ఇర్షాద్ అనే మదర్సాను స్థాపించాడు. ఆజాద్ సంస్థ కోసం, హిజ్బుల్లా, జలాలుద్దీన్ మరియు అబ్దుర్ రజాక్ ప్రముఖ రిక్రూటర్లు, వీరు బెంగాల్‌లోని హిందూ మరియు ముస్లిం విప్లవకారులను కూడా ఏకం చేశారు. 1942లో  క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించబడినప్పుడు ఆజాద్ అనేకసార్లు జైలుకెళ్లారు మరియు INC అధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రపంచ యుద్ధ సమయంలో సిల్క్ లెటర్ ఉద్యమం ఒకటి మాత్రమే ప్రతిఘటన ఉద్యమం కాదు. గదర్ ఉద్యమంలో అనేక మంది ముస్లింలు పాల్గొని అమరులయ్యారు. సైనికుల మధ్య తిరుగుబాటును ప్రేరేపించడానికి ప్రయత్నించినందుకు రెహ్మత్ అలీని లాహోర్‌లో ఉరితీశారు. సింగపూర్‌లో ఫిబ్రవరి, 1915లో, పంజాబ్‌కు చెందిన ఎక్కువ మంది ముస్లింలతో కూడిన  5వ లైట్ ఇన్ ఫ్యాoట్రి Light Infantry తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు సైనికులు కొన్ని రోజులు  సింగపూర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విప్లవకారులు తరువాత ఓడిపోయారు, బంధించబడ్డారు మరియు కాల్చి చంపబడ్డారు.

భారతీయులలో ప్రబలంగా ఉన్న మరో అపోహ ఏమిటంటే బెంగాలీ విప్లవకారులు కేవలం హిందువులు మాత్రమే. కాని జుగంతర్ మరియు అనుశీలన్ వంటి హిందూ మతపరమైన భావాలు కలిగిన విప్లవాత్మక సంస్థలు చాలా మంది క్రియాశీలక  ముస్లిం సభ్యులను కలిగి ఉన్నాయి. సిరాజుల్ హక్, హమీదుల్ హక్, అబ్దుల్ మోమిన్, మక్సుద్దీన్ అహ్మద్, మౌల్వీ ఘయాసుద్దీన్, నసీరుద్దీన్, రజియా ఖాతున్, అబ్దుల్ ఖాదర్, వలీ నవాజ్, ఇస్మాయిల్, జహీరుద్దీన్, చాంద్ మియాన్, అల్తాఫ్ అలీ, అలీముద్దీన్ మరియు ఫజులుల్ ఖాదర్ చౌదరి వంటి బెంగాలీ విప్లవకారులు  హిందువులతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టారు. వారిలో చాలా మందిని అండమాన్‌కు పంపడం లేదా చంపడం జరిగింది

ప్రపంచ యుద్ధం తరువాత, బ్రిటిష్ వారు క్రూరమైన రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చర్యకు వ్యతిరేకంగా భారతీయులు నిరసన వ్యక్తం చేశారు మరియు చాలా మంది నాయకులను అరెస్టు చేశారు. జలియన్‌వాలాబాగ్‌లో సైఫుద్దీన్‌ కిచ్లెవ్‌ అరెస్ట్‌ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ప్రజలను ఊచకోత కోశారు. జలియన్‌వాలాలో చంపబడిన ముస్లింల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలోనే, 1919 నుండి, అబ్దుల్ బారీ ఫిరంగిమహ్లీ, మజరుల్ హక్, జాకీర్ హుస్సేన్, మహ్మద్ అలీ మరియు షౌకత్ అలీ మాస్ లీడర్‌లుగా ఎదిగారు. బి అమ్మ, అమ్జాదీ బేగం, నిషాత్ అల్-నిసా వంటి మహిళలు కూడా స్వాతంత్ర్య పోరాటంలో దూకారు.

6వ భాగం: 1930-1947:

తమిళనాడులో, అబ్దుల్ రహీం 1930లలో అణచివేత వలస పాలనకు వ్యతిరేకంగా కార్మికులను సంఘటితం చేశాడు. V. M అబ్దుల్లా, షరీఫ్ బ్రదర్స్ మరియు అబ్దుల్ సత్తార్ దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రముఖ ముస్లిం నాయకులు, జాతీయవాద ఉద్యమాలకు నాయకత్వం వహించారు మరియు హింసలు మరియు జైలు శిక్షలను ధైర్యంగా ఎదుర్కొన్నారు.

ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నేతృత్వంలోని పఠాన్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింసాయుతం గా ఆందోళన జరిపారు. 1930లో, పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్‌లో గఫార్ ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన జనంపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపారు. మాతృభూమి సేవ కోసం వందలాది మంది పఠాన్లు తమ ప్రాణాలను అర్పించారు.

 ఐపీ /Ipiకి చెందిన ఫకర్, మీర్జా అలీఖాన్, మరియు పగారోకు చెందిన పీర్, సిబ్ఘతుల్లా, 1930లలో వజీరిస్థాన్ మరియు సింధ్‌లలో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారితో పోరాడేందుకు తమ సైన్యాన్ని సిద్దం చేసారు.. భారతదేశాన్ని విముక్తి చేయడానికి సుభాష్ చంద్రబోస్ మరియు యాక్సిస్ పవర్స్ వారి సైన్యాలతో పొత్తు పెట్టుకున్నారు.

1941లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గృహనిర్బంధం నుంచి తప్పించుకున్నారు. తప్పించుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి మియాన్ అక్బర్ షా. నేతాజీ బెర్లిన్ చేరుకుని ఫ్రీ ఇండియా లెజియన్‌ను ఏర్పాటు చేశారు. అబిద్ హసన్ ఇక్కడ అతనికి కార్యదర్శిగా పనిచేశాడు. జర్మనీ నుండి జపాన్‌కు ప్రసిద్ధ జలాంతర్గామి ప్రయాణంలో బోస్ తో పాటు అబిద్ మాత్రమే అతని సహచరుడు. 1943లో నేతాజీ ఆజాద్ హింద్ సర్కార్ మరియు ఆజాద్ హింద్ ఫౌజ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ లెఫ్టినెంట్ కల్నల్ అజీజ్ అహ్మద్, లెఫ్టినెంట్ కల్నల్ M.K కియాని, లెఫ్టినెంట్ కల్నల్ ఎహ్సాన్ ఖాదిర్, లెఫ్టినెంట్ కల్నల్ షా నవాజ్, కరీం ఘని మరియు D.M ఖాన్ వంటి అనేక మంది ముస్లింలు ముఖ్యమైన శాఖల మంత్రులు అయ్యారు. ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధంలో పరాజయాలను  ఎదుర్కొoది మరియు దాని సైనికులను బ్రిటిష్ వారు బందీలుగా పట్టుకున్నారు. 1946లో రషీద్ అలీని మరియు ఇతర ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను విడుదల చేయాలని కోరుతూ కోల్‌కతా రోడ్‌పై హిందువులు మరియు ముస్లింలు ప్రదర్సన జరిపారు మరియు రషీద్ అలీ ఖైదు హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా మారిoది. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. డజన్ల కొద్దీ భారతీయులను చనిపోయారు. ఇతర ప్రాంతాలలో, ముంబై మరియు కరాచీలలో, ఆజాద్ హింద్ ఫౌజ్‌కు మద్దతుగా ఇండియన్  రాయల్ నేవీ తిరుగుబాటు చేసింది. ముంబై నౌకాశ్రయంలో తిరుగుబాటు సైనికులకు కల్నల్ ఖాన్ నాయకత్వం వహించినాడు. ఈ తిరుగుబాటు యొక్క ప్రముఖ అమరవీరులలో అన్వర్ హుస్సేన్ ఒకరు.

భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. ఆంగ్లేయులు లక్షలాది భారతీయుల ప్రాణాల బలిగొన్నారు. అమర వీరులు చెల్లించిన జీవితాలు హిందువు కాదు, ముస్లిం కాదు. జీవితాలు భారతీయులవి. ప్రాణాలర్పించిన వారు మొదట భారతీయులు, తరువాత హిందువులు లేదా ముస్లింలు.

అల్లా బక్స్ సోమ్రూ, కె. ఎ. హమీద్, ఐపికి చెందిన ఫకర్, అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ, అబుల్ కలాం ఆజాద్ మరియు ఇతరులు విభజనను ఆపడానికి, ముస్లిం లీగ్ యొక్క విభజన మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడారు. విషాదకరంగా, ఏడు దశాబ్దాలకు పైగా ప్రజలు మన స్వాతంత్ర్య పోరాటంలోని ఈ ముఖ్యమైన అంశాన్ని మరచిపోయి  ఈ గొప్ప పోరాటాన్ని సంకుచిత మార్గాల్లో  చూడడానికి ప్రయత్నించారు.

 

No comments:

Post a Comment