1918లో అలీ అష్రఫ్ జన్మించినప్పుడు రష్యాలో విప్లవం వచ్చింది మరియు దాని
ప్రభావం ప్రపంచంపై కనిపించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు “ఇంక్విలాబ్” అనే నినాదo చేశారు. అలీ అష్రఫ్ పై అతని తండ్రి మౌలానా అలీ
అస్గర్ ప్రభావం కలదు. అలీ అష్రఫ్, ఆలీమ్‌తో పాటు మంచి రచయిత
కూడా. లియో టాల్‌స్టాయ్ పుస్తకాలు, హెర్బర్ట్ స్పెన్సర్ సిద్ధాంతంతో సహా
అనేక మంది యూరోపియన్ పండితుల పుస్తకాలను అనువాదం చేసారు.
అలీ అష్రఫ్ భారతదేశ స్వాతంత్ర్య యుద్ధంలో చురుకుగా
పాల్గొన్నారు. ఛప్రా(బీహార్)లో ఖిలాఫత్ కమిటీ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా
అధ్యక్షుడిగా ఉన్నారు. అలీ అష్రఫ్ ఇంటికి మహాత్మా గాంధీ, మౌలానా షౌకత్ అలీ వంటి చాలా
మంది పెద్దలు వచ్చి బస చేసేవారు.
అలీ అష్రఫ్ కొంచెం పెద్దయ్యాక ఖిలాఫత్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చూశారు.
జలియన్ వాలా బాగ్ మారణహోమం కథ విన్నారు.
అలీ అష్రఫ్ విప్లవం మరియు విద్య యొక్క వాతావరణంలో పెరిగారు. అలీ అష్రఫ్ తన ప్రారంభ
శిక్షణను ఇంట్లో పొందారు. కొంతకాలం పాటు తండ్రితో కలిసి హైదరాబాద్‌లో ఉన్నారు.
మెట్రిక్యులేషన్ తర్వాత, అలీ అష్రఫ్ పాట్నా విశ్వవిద్యాలయంలో
అడ్మిషన్ పొందారు మరియు అక్కడ అనేక మంది విప్లవకారులను కలుసుకున్నారు. చాలా మంది
పెద్ద నాయకులతో పరిచయం అయ్యారు మరియు
భారతదేశ స్వాతంత్ర్య యుద్ధంలో పూర్తిగా పాల్గొన్నారు.. చిన్నతనంలో మౌలానా షౌకత్
అలీని కలిసే అవకాశం రావడంతో తన పేరులో షౌకత్ అనే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. “అఫ్సానాలు”
రాయడం అలీ అష్రఫ్ కు చాలా ఇష్టం. చాలా చిన్న వయస్సులో, పాట్నా నుండి వచ్చే "షమీ"
వార్తాపత్రికలో అతని రచనలు ఉండేవి.
రష్యా విప్లవ ప్రభావంతో యువత కమ్యూనిస్టు
భావజాలానికి దగ్గరవుతున్న కాలంలో అలీ
అష్రఫ్ రష్యా విప్లవంతో ప్రభావితం అయి కామ్రేడ్ అలీ అష్రఫ్ గా మారారు. అలీ అష్రఫ్
1937లో బీహార్ స్టూడెంట్ ఫెడరేషన్ స్థాపనలో
ముఖ్యమైన పాత్ర పోషించారు మరియు దాని మొదటి ప్రధాన కార్యదర్శి అయ్యారు. కాంగ్రెస్
అధ్యక్ష పదవికి రాజీనామా చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాట్నాకు వచ్చినప్పుడు, యువకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు, అందులో అలీ అష్రఫ్ కూడా ఉన్నారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు ఎంఎన్
రాయ్ పాట్నాలో ఉన్న కాలం అది. 1939లో, అలీ అష్రఫ్ తన సహచరులతో కలిసి బీహార్‌లో
కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు మరియు ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ నిషేధించబడింది.
ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది.
విప్లవకారులు “నా దేంగే ఏక్ పై, నా
దేంగే ఏక్ బ్రదర్” వంటి నినాదాలు చేయడం ప్రారంభించారు.
ఈ సమయంలో, అలీ అష్రఫ్ చాలా కాలం జైలులో ఉన్నాడు. జనవరి 1940 ప్రారంభంలో అలీ అష్రఫ్ ను అరెస్టు చేసి హజారీబాగ్ జైలుకు పంపారు. 26 జనవరి 1940న, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఒక ఊరేగింపుగా పాట్నాలో బయలుదేరి అలీ అష్రఫ్ ఇంటికి వెళ్లి, అతని కుటుంబ సబ్యులకు తమ సంఘీభావ సందేశాన్ని అందించింది. అదే
సమయంలో 1942లో స్టూడెంట్ ఫెడరేషన్ సెషన్
జరిగినప్పుడు. అప్పుడు ఆయన పేరు మీద సదస్సు వేదికకు అలీ అష్రఫ్ నగర్ అని పేరు
పెట్టారు.
1942 లో, బ్రిటిష్ వారు కమ్యూనిస్ట్ ఖైదీలందరినీ
విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలీ అష్రఫ్ బయటకు వచ్చే అవకాశం కూడా పెరిగింది.
కానీ మిగిలిన రాజకీయ ఖైదీలను విడుదల చేయనందుకు, అలీ అష్రఫ్ తన నిరసన తెలుపుతూ జైలును విడిచిపెట్టడానికి
నిరాకరించారు. ఆ తర్వాత అలీ అష్రఫ్ 1942లో జైలు నుంచి విడుదల అయ్యారు.. స్వామి సహజానంద్ ఆధ్వర్యంలో పాట్నాలో
కిసాన్ సభ జరిగింది. అందుకే అందులో అలీ అష్రఫ్ చురుగ్గా పాల్గొన్నాడు.
క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు 1942లో ప్రారంభమైంది.క్విట్ ఇండియా ఉద్యమం లో
బ్రిటిష్ వారు అలీ అష్రఫ్ కోసం వెతుకుతున్నారు, అయితే అతను అండర్‌గ్రౌండ్ అయ్యాడు. అలీ అష్రఫ్ తమ్ముడు అలీ అమ్జాద్, అప్పుడు పాట్నా విశ్వవిద్యాలయంలో
చదువుతున్నాడు మరియు బీహార్ స్టూడెంట్ ఫెడరేషన్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. క్విట్
ఇండియా ఉద్యమ కాలం లో అలీ అష్రఫ్ రహస్యంగా పాట్నా విడిచి ముంబై వెళ్లి ముంబైలోని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం ప్రచురిస్తున్న
"క్వామీ జంగ్" వార్తాపత్రిక సంపాదకుడు అయ్యారు మరియు ఇక్కడ అతని పేరు
జ్ఞాన్ చంద్. జనవరి 1943లో, అలీ అష్రఫ్‌కు సంబంధించి ఎలాంటి క్లూ లభించకపోవడంతో పాట్నాలోని అతని
ఇంటిని పోలీసులు అటాచ్ చేశారు.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, పార్టీ బీహార్ కమిటీ ద్వారా వెలువడిన
"జనశక్తి" వార్తాపత్రిక కు అలీ అష్రఫ్ సంపాదకుడిగా 1965 వరకు కొనసాగాడు. 1965లో పాట్నా వదిలి ఢిల్లీకి మకాం
మార్చారు. ఈ సమయంలో అతను 1965 నుండి 1972 వరకు "సోవియట్ రివ్యూ" యొక్క జాయింట్ ఎడిటర్‌గా పదవిని
నిర్వహించాడు. అలాగే చాలా కాలం అంటే 1972 నుండి 1975 వరకు మాస్కోలో పార్టీ సాహిత్యంపై
మరియు 1976 నుండి 1982 వరకు ఢిల్లీలోని సోవియట్ రాయబార కార్యాలయంలో సమాచార విభాగంలో
పనిచేశారు.
అలీ అష్రఫ్ తన కుటుంబంతో
అలీ అష్రఫ్ డాక్టర్ మైమూనా జాఫ్రీని వివాహం చేసుకొన్నారు. డాక్టర్ మైమూనా జాఫ్రీ పాట్నా మహిళా కళాశాలలో ఉర్దూ ప్రొఫెసర్‌గా ఉండేవారు. తర్వాత అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి బదిలీ అయ్యారు. మరియు అక్కడ నుండి పదవీ విరమణ చేసారు. అలీ అష్రఫ్ కూడా పదవీ విరమణ తర్వాత అలీఘర్‌లో స్థిరపడ్డారు. ఆయన జీవితంలో ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో పుస్తకాలు అనువదించారు. కామ్రేడ్ అలీ అష్రఫ్ 2002లో అలీగఢ్‌లో 84 ఏళ్ల వయసులో మరణించారు
No comments:
Post a Comment