మగధ గాంధీ అని పిలువబడే సయ్యద్ ఫిదా హుస్సేన్ విలువలకు
రాజీపడని అద్భుతమైన భారతదేశ స్వాతంత్ర సమరయోదులలో ఒకడు.
సయ్యద్ ఫిదా హుస్సేన్ 1904లో బీహార్‌లోని జెహనాబాద్ జిల్లా
పింజౌరా గ్రామంలో జన్మించారు.ఫిదా హుస్సేన్ తండ్రి పేరు సయ్యద్ అహ్మద్ అబ్దుల్
అజీజ్.ఇంట్లో ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత, తదుపరి చదువులు కొసం సయ్యద్ ఫిదా హుస్సేన్
కలకత్తా వెళ్ళాడు. కలకత్తా
లో ఫిదా హుస్సేన్ మెట్రిక్యులేషన్
మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసాడు.
ఫిదా హుస్సేన్ విద్యార్థి జీవితం నుండి
భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్నారు. 1917లో విజయవంతమైన చంపారన్ సత్యాగ్రహం నుండి ఫిదా హుస్సేన్ స్ఫూర్తిపొందారు.. ఇంతలో ఖిలాఫత్ ఉద్యమం
ప్రారభమైనది. బి అమ్మ, తన కుమారులు కుమారుడు మౌలానా మహమ్మద్ అలీ జోహార్ మరియు మౌలానా షౌకత్ అలీతో కలిసి భారతదేశం అంతటా ఖిలాఫత్
ఉద్యమం గురించి ప్రచారం చేస్తున్నారు..
1919లో వచ్చిన రౌలట్ చట్టం భారతదేశమంతటా
వ్యతిరేకించబడింది; ఈ చట్టం కు నిరసనగా భారతదేశం అంతటా
సమ్మెలు, ఊరేగింపులు మరియు ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.మహాత్మా గాంధీజీ రౌలట్
చట్టం కు వ్యతిరేకంగా సత్యాగ్రహానికి
పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13, 1919న జాలి వాలా బాగ్‌లో నిరాయుధలయిన గుంపుపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపారు. ఆ తర్వాత యావత్ భారతదేశంలో
ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. ఫిదాహుస్సేన్ వంటి 15 ఏళ్ల యువకుడు భారతదేశ స్వాతంత్ర్య
యుద్ధంలో పాల్గొనడానికి పూర్తిగా సిద్దమైనాడు.
ఏప్రిల్ 1920లో గయా నగరంలో జరిగిన ఖిలాఫత్ ఉద్యమ ఊరేగింపులో ఫిదాహుస్సేన్ పాల్గొన్నారు. అదే సంవత్సరంలో, 5 డిసెంబర్ 1920న, సహాయ నిరాకరణ ఉద్యమం విజయవoతం చేయడానికి మౌలానా షౌకత్ అలీ, మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్, స్వామి సత్యదేవ్ తదితరులతో కలిసి ఫిదాహుస్సేన్ గయ దాని పరిసర
ప్రాంతాలలో పర్యటించారు.
1921 ఆగస్టు 12న ఈద్ ఉల్ జోహా సందర్భంగా మహాత్మా
గాంధీ, మౌలానా ముహమ్మద్ అలీ,
జమునా లాల్ బజాజ్ తదితరులతో కలిసి, మగధ ప్రాంతమంతా ఫిదాహుస్సేన్ పర్యటించారు.వాలంటీర్ మరియు స్వాతంత్ర వీరుని
హోదాలో, ఫిదా హుస్సేన్ మగధ మొత్తం ప్రాంతం పర్యటించి యువతకు స్వతంత్ర పోరాటం
లో పాల్గొనాలని స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చారు.
1922లో దేశబంధు చిత్తరంజన్ దాస్ అద్యక్షతన 37వ కాంగ్రెస్ గయాలో జరిగింది. ఒక స్వాతంత్ర సమర వీరుడిగా మరియు స్వచ్ఛంద
సేవకుడిగా ఆ సదస్సును విజయవంతం చేయడానికి, ఫిదా హుస్సేన్ పగలు మరియు రాత్రి కృషి చేసారు. ఫిదా
హుస్సేన్ కృషి చాలా ప్రశంసించబడింది మరియు మగధ ఆ ప్రాంతంలో లోక ప్రియుడైన కాంగ్రెస్ నాయకుడిగా ప్రజల మనస్సులో పేరు
తెచ్చుకున్నారు.
14 జనవరి 1927న, మహాత్మా గాంధీ ఖాదీ వస్త్రాల ప్రచారం
మరియు ప్రజల అవగాహన కార్యక్రమంప్రారంభించారు. దీనికి సంబంధించి, గాంధీజీ ధన్‌బాద్ మీదుగా మగధ
ప్రాంతానికి వచ్చినప్పుడు, ఫిదా హుస్సేన్ గాంధీజీ కి చాలా సహకారం అందించారు. ఫిదా హుస్సేన్ మహాత్మా గాంధీ ప్రేరణ తో ఖాదీ జీవితాంతం ఖాది దుస్తులు ధరించారు.
1928లో ఫిదా హుస్సేన్ సైమన్ కమిషన్‌ను
వ్యతిరేకించారు,అనుచరులతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు. బీహార్ రాజధాని
పాట్నాలో సయ్యద్ హసన్ ఇమామ్ నాయకత్వం లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకoగా జరిగిన కార్యక్రమంలో బహిరంగంగా పాల్గొని తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించారు.
లాహోర్ కాంగ్రెస్ 1929 డిసెంబర్ 19న జవహర్‌లాల్ నెహ్రూ అద్యక్షతన జరిగింది. సదస్సులో పూర్ణ స్వరాజ్ కావాలని డిమాండ్ చేశారు మరియు జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు.
లాహోర్ కాంగ్రెస్ తీర్మానానికి అనుగుణంగా 1930 జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఫిదా
హుస్సేన్ ఘనంగా నిర్వహించారు.అదే సంవత్సరం 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ నిర్వహించారు. ఫిదా హుస్సేన్ విదేశీ వస్తుబహిష్కరణ
ఉద్యమం లో పాల్గొన్నారు మరియు
గంజాయి, గంజాయి, కల్లు, మద్యం దుకాణాలను శాంతియుతంగా మూసివేయిoచారు.ఇందుకు
గాను ఫిదా హుస్సేన్ తన సహచరులతోసహా పాటు అరెస్టు
అయి ఆరు నెలల జైలుశిక్ష అనుభవించారు..
భగత్ సింగ్, సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురులను 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో ఉరి తీసారు.దాని
ప్రభావం బీహార్ తో సహా దేశం మొత్తం కన్పించినది.ఫిదా హుస్సేన్ భగత్ సింగ్, సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురుల ఉరితీతకు వ్యతిరేకంగా తీవ్ర జాతీయవాదం
వైపుకు మరలాడు. ఫిదా హుస్సేన్ నాయకత్వం లో మగధ అంతటా నిరసన సభలు నిర్వహించారు.
ఈ క్రమంలో 1931 మే 30, 31 తేదీల్లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి అద్యక్షతన జెహనాబాద్ సబ్ డివిజన్ (ప్రస్తుతం జిల్లా)లో
రాజకీయ సమావేశం జరిగింది. ఈ రాజకీయ సమావేశం లో ఫీదాహుస్సేన్ ఉత్సాహంగా పాల్గొని తన
సేవాభావం తో అందరి హృదయాలను గెలుచుకున్నారు. స్వయంగా రాజేంద్రప్రసాద్, ఫీదా హుస్సేన్
ను ప్రశంసించారు.
1934 భూకంపం బీహార్ అంతటా విధ్వంసం
సృష్టించింది; అప్పుడు ఫిదా హుస్సేన్ భూకంపంబాధితుల సేవలో అహోరాత్రులు శ్రమిస్తూ
వారికి సహాయ సహకారాలు అందించారు మరియు విరాళాలు సేకరించారు. బ్రిటిష్ వారి అణచివేత
నుండి భారతదేశాన్ని విడిపించడానికి, ఫిదా హుస్సేన్ ఆందోళనలకు తోపాటు విప్లవ జర్నలిజం చేస్తూ ప్రజలకు అవగాహన
కల్పించారు.
ఫీద హుస్సేన్ "చింగారి " అనే ఒక
విప్లవాత్మక పత్రికలో వ్రాసేవారు. బ్రిటీష్ వారి దురాగతాలను ఖండించడం తో పాటు ఫీదా హుస్సేన్ బ్రిటిష్ వారిని వ్యతిరేకించమని
ప్రజలను కోరేవారు.జెహనాబాద్ నుండి
వస్తున్న ఈ పత్రిక ప్రచురణ మరియు పంపిణీ బాధ్యతను ఫిదా హుస్సేన్ స్వయంగా తీసుకున్నారు.
ఫిదా హుస్సేన్ రైతు ఉద్యమంలో కూడా ముందున్నాడు. మొదట షా మహమ్మద్ జుబైర్ యొక్క నాయకత్వంలో ఆతరువాత అతని సోదరుడి షా మహమ్మద్ ఉమైర్ తో కలసి రైతు ఉద్యమం పాల్గొన్నారు
మరియు రైతు ఉద్యమం ను బలపరిచారు. యదునందన్
శర్మ, రామానంద్ మిశ్రా, మోహన్ లాల్ గౌతమ్ వంటి రైతు నాయకులతో కలిసి పనిచేసారు.
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన స్వర్ణోత్సవ
వేడుకల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 28-30 డిసెంబర్ 1935లో జెహనాబాద్‌లో ప్రభాత్ ఫేరి, ఖాదీ ఎగ్జిబిషన్, కాంగ్రెస్ విజయాలపై వివరణ, అమరవీరుల త్యాగాలు ఇలా ఎన్నో అంశాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించడంలో ఫిదా హుస్సేన్
ముఖ్యపాత్ర పోషించారు.
స్వామి సహజానంద సరస్వతితో కలిసి 1937లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్
మంత్రివర్గం ముందు రైతుల సమస్యలను ఉంచారు. 1938లో కాంగ్రెస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్
మగధ పర్యటన విజయవంతమైంది. పర్యటన విజయవంతం లో ఫిదా హుస్సేన్ ప్రముఖ పాత్ర వహించారు.
1940లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ నాయకత్వం
లో కాంగ్రెస్ 53వ మహాసభలు జరిగాయి.ఫిదా హుస్సేన్ మహాసభలలో
పాల్గొనడమే కాకుండా పలు కీలక సూచనలు
చేశారు.
1940లో ఫిదా హుస్సేన్ జెహనాబాద్‌లో
వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నారు. జెహనాబాద్‌సబ్ డివిజన్ లో (ప్రస్తుతం జిల్లా) మొదటి సత్యాగ్రహి అయ్యాడు
1942ఆగస్ట్ విప్లవం, విజయవంతం కావడానికి ఫిదా హుస్సేన్ కృషి చేసాడు.8 ఆగస్టు 1942గాంధీజీ నాయకత్వం లో భారతదేశం అంతటా 'క్విట్ఇoడియా ' నినాదం మార్మోగింది. ఫిదా హుస్సేన్ కూడా తన సహచరులతో కలిసి, మగధ ప్రాంతo లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని విజయవంతం చేసాడు. ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు; ఆయుధాలను దోచుకోవడంతోపాటు పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఫిదా హుస్సేన్ యొక్క అనేక విప్లవ సహచరులు పోలీసులచే చంపబడ్డారు. ఫిదా హుస్సేన్ కూడా బుల్లెట్ బాధితుడు. ఫిదా హుస్సేన్‌ను అరెస్టు చేశారు మరియు భాగల్పూర్ సెంట్రల్ జైలుకు పంపారు.
అక్టోబరు 1946లో, బీహార్‌లో అల్లర్లు జరిగినవి. ఫిదా
హుస్సేన్ ఈ అల్లర్లను ఆపడానికి చాలా ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. 1947లో అల్లర్లకు గురైన ప్రాంతాలలో
పర్యటించడానికి గాంధీ మగధకు వచ్చినప్పుడు, ఫిదా హుస్సేన్, గాంధీ తో పాటు మొత్తం మగధ ప్రాంతాన్ని పర్యటించారు. ఫిదా
హుస్సేన్ స్థానిక పీడిత ప్రజలకు సహాయం చేసారు; దీంతో పాటు బయటి నుంచి వచ్చిన నేతలందరికీ అలర్ల పరిస్థితిపై అవగాహన
కల్పించారు.మగధ లో సహాయక చర్యల కోసం జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, సైఫుద్దీన్ కిచ్లు , సర్దార్ పటేల్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, జనరల్ షానవాజ్ మొదలగు వందలాది మంది అగ్రనేతలు ఈ ప్రాంతంలో మకాం
వేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఫిదా హుస్సేన్ 1957లో కాంగ్రెస్ టిక్కెట్‌పై జెహనాబాద్ నుంచి
ఎమ్మెల్యేగా ఎన్నికైనారు, 1967లో మళ్లీ అదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు. బీహార్ శాసనసభ సభ్యునిగా ప్రజా ప్రయోజనాల కోసం అనేక సంబంధిత ప్రశ్నలను లేవనెత్తారు.
1980లో, సయ్యద్ ఫిదా హుస్సేన్ జెహనాబాద్‌లో
మరణించాడు. మగధలో గాంధీ యుగం నాటి బలమైన
స్తంభం ముగిసింది.
'మగధ గాంధీ'గా ప్రసిద్ధి చెందిన సయ్యద్ ఫిదా హుస్సేన్ ఎప్పుడూ అవకాశవాదం,అవినీతి, మతతత్వం, పెట్టుబడిదారీ విధానంపై పోరాటం జరిపారు. నీతి, నిజాయితీ, సరళత, ఆదర్శవాదం వంటి ఉత్తమ గుణాల వల్ల సయ్యద్ ఫిదా హుస్సేన్ కలకాలం గుర్తు ఉంటారు
No comments:
Post a Comment