17 August 2022

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిం మహిళలు Muslim women in India’s freedom struggle

 



 

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అనేక మంది ముస్లిం మహిళలు చురుకుగా పాల్గొన్నారు.  ఉద్యమంలో ప్రధాన పాత్రలు పోషించిన పురుషులను కటకటాల వెనక్కి నెట్టడంతో, మహిళలు ఉద్యమం అంతరించిపోకుండా చూసుకున్నారు మరియు దేశ స్వేచ్ఛ కోసం పోరాడారు.

హజ్రత్ బేగం మహల్‌, అబాదీ బానో బేగం, బీబీ అమ్తుస్ సలామ్, బేగం అనిస్ కిద్వాయ్, బేగం నిషాతున్నీసా మోహనీ బాజీ జమాలున్నీసా, హజారా బీబీ ఇస్మాయిల్, కుల్సుమ్ సయానీ, మరియు సయ్యద్ ఫక్రుల్ హాజియా హసన్ వంటి అనేకమంది  ముస్లిం మహిళలు భారతదేశ చరిత్రలో తమదైన ముద్ర వేశారు.


1.అబాది బానో బేగం (జననం 1852- మరణం 1924)

అబాది బానో బేగం రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న మొదటి ముస్లిం మహిళ మరియు భారతదేశాన్ని బ్రిటిష్ రాజ్ నుండి విముక్తి చేసే ఉద్యమంలో కూడా భాగమైంది. గాంధీచే బి అమ్మగా పిలవబడే అబాది బానో బేగం 1852లో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించింది.

రాంపూర్ రాష్ట్రంలోని సీనియర్ అధికారి అబ్దుల్ అలీ ఖాన్‌తో బి అమ్మ వివాహం జరిగింది.

తన భర్త మరణం తర్వాత, అబాది బానో బేగం తన పిల్లలను (ఇద్దరు కుమార్తెలు మరియు ఐదుగురు కుమారులు) స్వయంగా పెంచి పెద్దజేసింది. పెంచుకుంది. అబాది బానో బేగం కుమారులు మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ మరియు మౌలానా షౌకత్ అలీ ఖిలాఫత్ ఉద్యమం మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖులుగా మారారు. బ్రిటీష్ రాజ్‌కు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో వారు ముఖ్యమైన పాత్ర పోషించారు.

సరోజినీ నాయుడు అరెస్టు తర్వాత, 1917-1921 వరకు తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, బ్రిటీష్ డిఫెన్స్ యాక్ట్‌కి వ్యతిరేకంగా నిరసిస్తూ బి అమ్మ ప్రతి నెలా రూ. 10 విరాళంగా ఇచ్చింది.

1917లో, బాల గంగాధర్ తిలక్‌తో కలిసి అన్నీ బిసెంట్ ప్రారంభించిన  హోమ్ రూల్ ఉద్యమo లో పాల్గొన్న తన కుమారులను బ్రిటిష్ వారు అరెస్టు చేసిన పిదప ఉద్యమం లో పాల్గొన్న వారిని మరియు విడుదల చేయాలనే ఆందోళనలో బానో కూడా పాల్గొన్నారు.

అబాది బానో బేగం సంప్రదాయవాద ముస్లిం మహిళ  అయినప్పటికీ, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ముస్లిం మహిళలలో  అత్యంత ప్రముఖురాలు  బి అమ్మా.

మహిళల మద్దతు పొందడానికి, మహాత్మా గాంధీ, అబాది బానో బేగం ను ఆల్-ఇండియన్ ముస్లిం లీగ్ సెషన్‌లో మాట్లాడమని ప్రోత్సహించేవారు అక్కడ అబాది బానో బేగం చేసిన ప్రసంగం బ్రిటిష్ ఇండియాలోని ముస్లింలపై శాశ్వత ముద్ర వేసింది.

ఖిలాఫత్ ఉద్యమం మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నిధుల సేకరణలో బానో ముఖ్యమైన పాత్ర పోషించారు.

 


2.బీబీ అమ్టస్ సలామ్ (మరణం 1985)

పాటియాలాకు చెందిన మహాత్మా గాంధీ 'దత్తపుత్రిక' బీబీ అమ్తుస్ సలామ్ ఒక సామాజిక కార్యకర్త మరియు విభజన నేపథ్యంలో మత హింసను ఎదుర్కోవడంలో మరియు విభజన తరువాత భారతదేశానికి వచ్చిన శరణార్థుల పునరావాసంలో చురుకైన పాత్ర పోషించిన గాంధీజీ శిష్యురాలు.

కలకత్తా, ఢిల్లీ మరియు దక్కన్‌లలో జరిగిన మతపరమైన అల్లర్ల సమయంలో బీబీ అమ్తుస్ సలామ్ చాలా సందర్భాలలో తన ప్రాణాలను పణంగా పెట్టి సున్నిత ప్రాంతాలకు వెళ్లింది.

గాంధీ స్థాపించిన ఆశ్రమంలో బీబీ సలామ్,  ముస్లింమహిళ     మరియు కాలక్రమేణా గాంధీకి దత్తపుత్రికగా మారింది.

నోఖాలీ అల్లర్ల తర్వాత, ఫిబ్రవరి 9, 1947న ది ట్రిబ్యూన్‌లో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం  నేరస్థులు తమను తాము  దోషులుగా భావించేందుకు ఉద్దేశించిన అమ్టస్ సలామ్ యొక్క 25 రోజుల ఉపవాసం గాంధీ మరియు అతని శిష్యుల చర్యల యొక్క అత్యంత ముఖ్యమైన ఫలితాలలో ఒకటిగా పేర్కొంది.

కిడ్నాప్‌కు గురైన మహిళలు మరియు పిల్లలను రక్షించే ప్రయత్నంలో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా అమ్టస్ సలామ్ బహవల్‌పూర్‌లోని డేరా నవాబ్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంది.


3.బేగం హజ్రత్ మహల్ (జననం 1820-మరణం 1879)

 

1857 తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించిన బేగం హజ్రత్ మహల్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు.

 

అవధ్ పాలకుడైన నవాబ్ వాజిద్ అలీ షా భార్య అయిన బేగం బ్రిటీష్ వారి నుండి ఎటువంటి సహాయాలు లేదా భత్యాలను అంగీకరించడానికి నిరాకరించింది. బేగం తన కమాండర్ రాజా జైలాల్ సింగ్ సహాయంతో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో ధైర్యంగా పోరాడింది.

 

బేగం హజ్రత్ మహల్ గా ప్రసిద్ది చెందిన ముహమ్మదీ ఖానుమ్, 1830లో ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించారు. ముహమ్మదీ ఖానుమ్, తండ్రి గులాం హుస్సేన్. ఆమెకు సాహిత్యంపై మంచి అవగాహన ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ మసీదులు మరియు దేవాలయాలను ధ్వంసం చేసి రహదారులకు చోటు కల్పించడం ముహమ్మదీ ఖానుమ్ లో తిరుగుబాటుకు ఉత్ప్రేరకంగా పనిచేసింది.

1856లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ అవధ్‌పై దండెత్తినప్పుడు మరియు అవధ్ చివరి నవాబు అయిన ముహమ్మదీ ఖానుమ్ భర్త కలకత్తాకు బహిష్కరించబడినప్పుడు, బేగం తన కుమారుడు బిర్జిస్ ఖదీర్‌తో కలిసి లక్నోలో ఉండాలని నిర్ణయించుకుంది. 

మే 31, 1857, విప్లకారులు స్వాతంత్ర్యం ప్రకటించడానికి మరియు నగరం నుండి బ్రిటిష్ వారిని వెళ్లగొట్టడానికి లక్నోలోని చావానీ పరిసరాల్లో సమావేశమయ్యారు.

జూలై 7, 1857, బేగం హజ్రత్ మహల్ తన కుమారుడైన బిర్జిస్ ఖదీర్‌ను అవధ్ నవాబుగా ప్రకటించింది. బేగం హజ్రత్ మహల్ 1,80,000 మంది సైనికులను కలిగి, నవాబ్ తల్లిగా లక్నో కోటను పునరుద్ధరించింది.

బేగం హజ్రత్ మహల్ 1879 ఏప్రిల్ 7న లక్నో లో మరణించింది.

4.బేగం అనిస్ కిద్వాయ్ (జననం 1906- మరణం 1982)

ఉత్తరప్రదేశ్ (UP)కి చెందిన బేగం అనిస్ కిద్వాయ్ అనే రాజకీయవేత్త మరియు సామాజిక కార్యకర్త తన జీవితంలో ఎక్కువ భాగాన్ని కొత్తగా స్వతంత్ర భారతదేశానికి సేవ చేయడానికి, శాంతి కోసం మరియు భారతదేశం యొక్క భయంకరమైన విభజన బాధితుల పునరావాసం కోసం పనిచేశారు. 

అనిస్ బేగం కిద్వాయ్ 1956 నుండి 1962 వరకు రాజ్యసభలో భారత జాతీయ కాంగ్రెస్ (INC)కి ప్రాతినిధ్యం వహించారు, రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు.

అనిస్ బేగం కిద్వాయ్ భారత జాతీయ ఉద్యమంలో చురుకుగా ఉన్నారు. 1947లో భారత స్వాతంత్ర్యం పొందినప్పటికీ అనిస్ బేగం కిద్వాయ్ భారతదేశం దేశ విభజనతో బాధపడింది.

అనిస్ బేగం కిద్వాయ్ భర్త షఫీ అహ్మద్ కిద్వాయ్ ముస్లింలు మరియు హిందువుల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి మరియు దేశ విభజనను నిరోధించడానికి చేసిన ప్రయత్నాల పలితంగా మత శక్తులచే హత్య చేయబడ్డారు. భర్త మృతితో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.తన భర్త మరణించిన తర్వాత ఆమె ఢిల్లీలోని మహాత్మా గాంధీని సందర్శించారు.

దేశం విడిపోవడం వల్ల తనలాగే బాధపడుతున్న మహిళలకు మద్దతుగా మరియు సహాయం చేయడానికి, అనిస్ బేగం, మహాత్మా గాంధీ దర్శకత్వంలో సుభద్ర జోషి, మృదులా సారాభాయ్ మరియు ఇతరులతో కలిసి పనిచేయడం ప్రారంభించింది.

అనిస్ బేగం బాధితుల కోసం రెస్క్యూ క్యాంపులను కూడా ప్రారంభించి వారికి అన్ని విధాలా అండగా నిలిచింది. అనిస్ బేగం ను ఆప్యాయంగా అనిస్ ఆపాఅని పిలిచేవారు. దేశ విభజన సమయంలో అనిస్ బేగం తనకు ఎదురైన అనుభవాలను ఆజాదీ కి చాన్ మే‘Azadi Ki Chaon Mein’ అనే పుస్తకం లో రాసింది.

 

5.బేగం నిషాతున్నీసా మోహనీ (జననం 1884- మరణం 1937)

బేగం నిషాతున్నీసా మోహనీ 1884లో ఉత్తరప్రదేశ్‌లోని అవధ్‌లో జన్మించారు మరియు ఆమె ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు "ఇంక్విలాబ్ జిందాబాద్" అనే నినాద సృష్టికర్త మౌలానా హస్రత్ మోహనీ, ని వివాహం చేసుకున్నారు. బ్రిటీష్ అధికారాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బేగం నిషాతున్నీసా, భారత విముక్తి పోరాటంలో అతివాది బాలగంగాధర తిలక్‌కు మద్దతు ఇచ్చింది.

బ్రిటీష్ వ్యతిరేక ఆర్టికల్ ను ప్రచురించినందుకు జైలు శిక్ష అనుభవించిన తర్వాత, బేగం నిషాతున్నీసా తన భర్త హస్రత్ మోహనీకి మీపై వచ్చిన ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కోండి. నాగురించి  ఆలోచన వద్దు. మీ నుండి బలహీనత యొక్క సంకేతాలు రాకూడదు. 'జాగ్రత్త'."అని ఉత్తరం రాసి హస్రత్ మోహనీ లో  ఉత్సాహాన్ని పెంచారు.

హస్రత్ మోహనీ జైలులో ఉన్నప్పుడు, బేగం నిషాతున్నీసా “ఉర్దూ-ఎ-ముఅల్లా Urdu-e-Mualla” దినపత్రిక ప్రచురించినది.

6.బాజీ జమాలున్నీసా, హైదరాబాద్ (జననం 1915- మరణం 2016)

తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న బాజీ జమాలున్నీసా 101వ ఏట జూలై 22 2016న హైదరాబాద్ నగరంలో కన్నుమూశారు.

జమాలున్నీసా బాజీ 1915లో హైదరాబాద్‌లో జన్మించారు మరియు వర్గ శాంతి మరియు దేశ స్వాతంత్ర్యం కోసం  పాటుపడ్డారు..

ఉదారవాద/ప్రగతిశీల వాతావరణంలో పెరిగిన జమాలున్నీసా బాజీ నిషేధిత జర్నల్ "నిగర్" మరియు అభ్యుదయ సాహిత్యం చదవడం ప్రారంభించింది.

నిజం పాలన లో మత సంప్రదాయాలలో పెరిగిన, జమాలున్నీసా బాజీ జాతీయవాద ఉద్యమం మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు, కొనసాగించింది.

మౌలానా హజ్రత్ మోహనీ ("ఇంక్విలాబ్ జిందాబాద్" అనే నినాదం రూపొందించిన వ్యక్తి మరియు స్వాతంత్ర్య పోరాటంలో "థండర్ బోల్ట్" అని పిలువబడ్డాడు) ఆమెను ప్రేరేపించినాడు..

కమ్యూనిస్ట్‌గా జమాలున్నీసా బాజీ ఇంపీరియల్ ప్రభుత్వం అరెస్టు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్న స్వాతంత్ర్య సమరయోధులకు ఆశ్రయం కల్పించింది.

జమాలున్నీసా బాజీ ఉర్దూ మరియు ఆంగ్లంలో నిష్ణాతులు మరియు బజ్మే ఇహబాబ్ అనే సాహిత్య సంఘాన్ని స్థాపించారు, ఇది సోషలిజం, కమ్యూనిజం మరియు అసమంజసమైన ఆచారాలపై చర్చలు నిర్వహించింది.

జమాలున్నీసా బాజీని  ఫస్ట్ లాన్సర్‌లోని హజ్రత్ సయ్యద్ అహ్మద్ బాద్-ఎ-పాహ్ దర్గాలో ఖననం చేశారు. జమాలున్నీసా బాజీ  మాజీ ఎమ్మెల్యే మరియు పాయం డైలీ వ్యవస్థాపకుడు మరియు "బాజీ"గా ప్రసిద్ధి చెందిన సయ్యద్ అక్తర్ హసన్ సోదరి.

జమాలున్నీసా బాజీ  మక్దూమ్ మొహియుద్దీన్ సన్నిహిత స్నేహితురాలు మరియు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సభ్యురాలు. బాజీ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మరియు మహిళా సహకార సంఘం వ్యవస్థాపక సభ్యులు  కూడా

7.హజారా బీబీ ఇస్మాయిల్, ఆంధ్రప్రదేశ్ (మరణం 1994)

మహమ్మద్ ఇస్మాయిల్ సాహెబ్ భార్య, హజారా బీబీ ఇస్మాయిల్, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు.

ఖాదీ ప్రచార ఉద్యమానికి కట్టుబడిన ఈ జంటపై మహాత్మా గాంధీ గణనీయమైన ప్రభావాన్ని చూపారు. గుంటూరు జిల్లాలో, ఆమె భర్త మొహమ్మద్ ఇస్మాయిల్ మొదటి ఖద్దర్ దుకాణాన్ని ప్రారంభించాడు అందువలన  అతనికి "ఖద్దర్ ఇస్మాయిల్" అనే పేరు వచ్చింది.

ఆంధ్ర ప్రాంతంలో ఆ సమయంలో తెనాలి, ముస్లిం లీగ్ యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. ప్రత్యేకంగా ఇక్కడ అది చురుకుగా ఉండేది.

హజారా మరియు ఆమె భర్త గాంధీకి మద్దతు ఇచ్చినందున, వారు ముస్లిం లీగ్ నుండి తీవ్రమైన శత్రుత్వాన్ని ఎదుర్కొన్నారు. జాతీయ ఉద్యమంలో పాల్గొన్నందుకు హజారా బీబీ భర్తని  పదే పదే అరెస్టులు చేసినప్పటికీ, హజారా బీబీ స్ఫూర్తిని కోల్పోలేదు.

8.కుల్సుమ్ సయాని (జననం 1900- మరణం 1987)

అక్టోబర్ 21, 1900న గుజరాత్‌లో కుల్సుమ్ సయానీ జన్మించింది. కుల్సుమ్ సయానీ భారత జాతీయ ఉద్యమంలో పాల్గొని సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు.

కుల్సుమ్ మరియు ఆమె తండ్రి 1917లో మహాత్మా గాంధీని కలిశారు. అప్పటి నుండి ఆమె గాంధీ బాటలో పయనించారు. భారత జాతీయ ఉద్యమం అంతటా, కుల్సుమ్ సయానీ సామాజిక మార్పుల కోసం కృషి చేసారు.

కుల్సుమ్ సయానీ సుప్రసిద్ధ స్వాతంత్ర  యోధుడు డాక్టర్ జాన్ మొహమ్మద్ సయానీ ని వివాహం చేసుకొన్నది.  కుల్సుమ్ సయానీ తన భర్త  మద్దతుతో భారత స్వాతంత్ర్య పోరాటంలో కుల్సుమ్ సయానీ అనేక సామాజిక, రాజకీయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది.

కుల్సుమ్ సయానీ నిరక్షరాస్యులతో కలిసి పనిచేయడం ప్రారంభించింది మరియు చరఖా తరగతిలో చేరింది. సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పించిన భారత జాతీయ కాంగ్రెస్ "జన్ జాగరణ్" ప్రచారాలలో పాల్గొంది. సయానీ ముంబయిలోని శివారు ప్రాంతాలు మరియు ముంబై మహానగరం లో తన సామాజిక కార్యకలాపాలు నిర్వహించినది. .

9.సయ్యద్ ఫక్రుల్ హాజియా హసన్ (మరణం 1970)

సయ్యద్ ఫక్రుల్ హజియాన్ హసన్ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడమే కాకుండా తన పిల్లలను కూడా అలా చేయమని కోరింది. ఫక్రుల్ హజియాన్ హసన్ ఇరాక్ నుండి భారతదేశానికి వలస వచ్చిన కుటుంబంలో జన్మించింది. ఫక్రుల్ హజియాన్ హసన్ తన పిల్లలను స్వాతంత్ర్య సమరయోధులుగా పెంచింది, తరువాత వారు "హైదరాబాద్ హసన్ బ్రదర్స్" గా పేరు తెచ్చుకొన్నారు.

ఫక్రుల్ హజియాన్ హసన్ ఉత్తరప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చిన అమీర్‌ హసన్‌ను వివాహం చేసుకుంది. ఫక్రుల్ హజియాన్ జీవిత భాగస్వామి అమీర్ హసన్ హైదరాబాద్ ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్నారు. ఉద్యోగంలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.

ఫక్రుల్ హజియాన్ హసన్ తన పర్యటనలలో భారతదేశంలోని మహిళల బాధలను గమనించింది. బాలికల అభివృద్దికి ఫక్రుల్ హజియాన్ హసన్ చాలా కృషి చేశారు.

ఫక్రుల్ హజియాన్ హసన్ హైదరాబాద్‌లో నివసించారు. బలమైన జాతీయ భావోద్వేగాలు కలిగిన మహిళగా ఫక్రుల్ హజియాన్ హసన్ జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

మహాత్మాగాంధీ డిమాండ్‌ మేరకు హైదరాబాద్‌లోని ట్రూప్‌ బజార్‌లోని అబిద్‌ మంజిల్‌లో విదేశీ దుస్తులను తగలబెట్టింది. సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాల్లో ఫక్రుల్ హజియాన్ హసన్ పాల్గొన్నారు.

ఫక్రుల్ హజియాన్ హసన్ భారత జాతీయ సైన్యంలోని ప్రతి సైనికుడిని తన పిల్లలలో ఒకరిగా భావించింది. శ్రీమతి సరోజినీ నాయుడు మరియు ఫక్రుల్ హాజియా హసన్ ఆజాద్ హింద్ ఫౌజ్ హీరోలను విడుదల చేయడానికి చాలా కృషి చేశారు.

No comments:

Post a Comment