11 June 2021

దళిత ముస్లింలు Dalit Muslims Salmaan Haidar

  

భారతదేశంలో ముస్లింలందరూ దాదాపు స్థానిక మతమార్పిడుల వారసులు.వీరి  పూర్వీకులు అరేబియా నుండి రాలేదు. వారు ఇస్లాం మతంలోకి మారిన స్థానికులు. వీరిని  రెండు విస్తృత సమూహాలుగా వర్గీకరించవచ్చు.

మొదటి వారు హిందూ ధర్మం లోని కుల అణచివేత నుండి తప్పించుకోవడానికి సామూహికంగా ఇస్లాం మతంలోకి మారిన దళితులు. ముస్లింల యొక్క సరళత మరియు సోదరభావం, ముఖ్యంగా సూఫీల ప్రభావం వారిపై ఉంది. సూఫీలు ​​వారిని ఆప్యాయంగా స్వాగతించారు. సూఫీ లాంగర్లలో (ఉచిత కమ్యూనిటీ వంటశాలలు), అన్ని కులాల ప్రజలు కలిసి తినడం వారిని ఆకట్టుకున్నాయి మరియు వారు సమానత్వం మరియు ఆత్మగౌరవం కోసం పెద్ద సంఖ్యలో ఇస్లాం మతంలోకి మారారు. వారి వారసులు ప్రస్తుత భారతీయ ముస్లిం జనాభాలో డెబ్బై ఐదు శాతం మంది ఉన్నారు. వీరు దళిత ముస్లింలు.

ఇక రెండోవ వారు ఇరాన్, సెంట్రల్ అరేబియా లేదా ఇరాన్ నుండి శతాబ్దాలుగా భారత దేశానికి వచ్చిన ముస్లింలు లేదా 'ఉన్నత' కుల హిందూ కుటుంబాల నుండి స్థానిక మతమార్పిడులు   లేదా ఇతర వెనుకబడిన కులాల(OBC) సమూహాల నుండి ఇస్లాం లోకి వచ్చిన వారి వారసులు.  వారు భారతీయ ముస్లిం సమాజంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

ఇస్లాం మతంలోకి మారినప్పటికీ, దళిత ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు విద్యా స్థితి దారుణంగా ఉంది. మొఘల్ పాలనలో శతాబ్దాలుగా వారు తమ హిందూ సహచరుల వలె నిర్లక్ష్యం చేయబడ్డారు. మొఘలులు దళిత ముస్లింల పరిస్థితులను మెరుగుపరచడంలో కాదు, పాలనపై ఆసక్తి చూపారు. దళిత ముస్లింల విద్య కోసం ఏ ముస్లిం పాలకుడు ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదు. బ్రిటీష్ వారి సమయం లో కూడా మరియు 1947 తరువాత కూడా వారి పరిస్థితి అదే విధంగా ఉంది.

ప్రస్తుత చట్టాల ప్రకారం, దళిత ముస్లింలకు షెడ్యూల్డ్ కులాలుగా రిజర్వేషన్ హక్కులు నిరాకరించబడ్డాయి.వారి పరిస్థితులు హిందూ దళితుల మాదిరిగానే ఉన్నాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం, చాలా వెనుకబడినవారిగా గుర్తించబడిన కులాల జాబితా లేదా షెడ్యూల్ రూపొందించబడింది. వీరు షెడ్యూల్డ్ కులాలుగా పిలువ బడినారు. వీరిలో హిందూ, ముస్లిం ఆనిమిస్ట్ Muslim animis, క్రిస్టియన్ మరియు సిక్కులుగా పరిగణించబడే కులాలు ఉన్నాయి. ఈ కులాలలో కొన్ని,\ ధోబి (దుస్తులను ఉతికే వారు ), మోచి (cobblers) మరియు హలాల్ఖోర్ (స్వీపర్లు) హిందూ మరియు ముస్లిం సభ్యులను కలిగి ఉన్నారు.వీరి  సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు చేశారు.

1950 లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి, వాటి ప్రకారం ఈ ప్రత్యేక ప్రయోజనాలు హిందువు అని చెప్పుకునే షెడ్యూల్డ్ కులాలకు మాత్రమే లభిస్తాయి మరియు తదనుగుణంగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కు సవరణ చేయబడింది, అది ప్రత్యేక ప్రయోజనాల కోసం కొన్ని కులాలను షెడ్యూల్డ్ కులాలుగా ప్రకటించే  అధికారం రాష్ట్రపతికి ఇస్తుంది.  ఒక కలం పోటు తో హిందూయేతర షెడ్యూల్డ్ కులాలకు  1935 భారత ప్రభుత్వ చట్టం వారికి అందించిన ప్రయోజనాలను తిరస్కరించబడినవి. 1956 లో, సిక్కు దళితులకు హిందూ దళితులు అనుభవిస్తున్న ప్రయోజనాలను విస్తరించడానికి ఆర్టికల్ 341 సవరించబడింది మరియు 1990లో దీనిని నయా బౌద్ధులకు విస్తరించింది. సిద్ధాంతపరంగా ఈ వర్గాలు షెడ్యూల్డ్ కుల హోదాను పొందగలిగితే, దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవులు ఎందుకు పొందలేరు?

భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక దేశంగా ప్రకటించింది, ఇక్కడ ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉంది మరియు చట్టం దృష్టిలో సమానత్వo  కలదు. సామాజిక-ఆర్ధిక పరిస్థితులు ఒకేలా ఉన్నప్పటికీ రిజర్వేషన్లు హిందూ దళితులకు మాత్రమే ఇవ్వబడినవి మరియు ముస్లిం దళితులకు ఇవ్వలేదు. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను  మరియు లౌకికవాదం మరియు సమానత్వ సూత్రాలను పూర్తిగా ఉల్లంఘించినట్లు కాదా!

ఈ రోజు ఉన్న చట్టం ప్రకారం, ఒక దళిత క్రైస్తవుడు లేదా ముస్లిం, హిందూ మతంలోకి మారితే అతనికి స్వయంచాలకంగా ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి, కాని ఒక దళిత హిందూ తన మతాన్ని మార్చుకుని క్రైస్తవ మతం లేదా ఇస్లాంను అంగీకరిస్తే, అతను అలాంటి ప్రయోజనాలను కోల్పోతాడు. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు  పూర్తిగా విరుద్ధంగా ఉంది.

మండల్ కమిషన్ నివేదిక ద్వారా ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) విభాగంలో దళిత ముస్లింలు మరియు క్రైస్తవులను చేర్చారు. మండల కమిషన్ నివేదిక, దళిత మరియు వెనుకబడిన కులOBC ముస్లింలకు కొన్ని ప్రయోజనాలను అందించింది. మండల్ కమిషన్  రెండు వర్గాల ముస్లింలను ఓబిసిలుగా చేర్చారు.

మొదటివారు  దళిత ముస్లింలు/ అంటరానివారు-ఇస్లాం మతంలోకి మారిన వారు. రెండోవ వారు సంఖ్య లో చాలా తక్కువ ఉన్నారు. వీరు  హిందూ సాంఘిక సమూహాలు   OBC నుండి ముస్లిలుగా  గుర్తించబడ్డారు-కూరగాయల పెంపకందారులు, పాలు ఆమ్మేవారు  మరియు ఇతరులు.

మొదటి వర్గాన్ని షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించాలి. OBC లకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల ప్రయోజనాలు మరియు విద్య విషయంలో కొన్ని పరిమిత రాయితీలు మాత్రమే ఇవ్వబడ్డాయి. షెడ్యూల్డ్ కులాలకు ఉద్యోగ రిజర్వేషన్లు మాత్రమే కాకుండా, రాష్ట్ర శాసనసభలు మరియు పార్లమెంటులో రాజకీయ రిజర్వేషన్లు, మరియు గృహనిర్మాణ పథకాలు, వడ్డీ లేని రుణాలు, వారిపై దారుణ కేసులను విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు వంటి సదుపాయాలు కల్పిoచబదినాయి. ఈ ప్రయోజనాల ఫలితంగా, హిందూ దళితులు గణనీయమైన పురోగతి సాధించగలిగారు. దళిత ముస్లింలు వారి కంటే చాలా వెనుకబడి ఉన్నారు. దళిత ముస్లింలకు కూడా ఇలాంటి పురోగతి సాధించడానికి ఇలాంటి ప్రయోజనాలను ఇవ్వడం సరైనది.  

దళిత ముస్లింలను OBC వర్గం లో చేర్చడం ద్వారా వారు మిగతా వారితో ఆర్థికంగా, సామాజికంగా మరియు విద్యాపరంగా పోటీ పడలేరు  దళిత ముస్లింలకు OBCలో చేర్చడం ద్వారా ప్రయోజనం లేదు. వారి పరిస్థితులలో మార్పు రాలేదు.దళిత ముస్లింలను ఒబిసి నుండి షెడ్యూల్డ్ కుల వర్గానికి మార్చడం వల్ల వారు జన జీవితంలోకి రాగలుగుతారు మరియు అది జరిగితే దళిత మరియు ఇతర ముస్లింల మధ్య కులాంతర వివాహాలు జరగడం ప్రారంభమవుతుంది మరియు నెమ్మదిగా వారిలో కుల వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది.

 

 

 

 

 

 

No comments:

Post a Comment