మెదడు యొక్క పెరుగుదల దాదాపు నలభై సంవత్సరాల
వయస్సు వరకు ఉంటుందని, తరువాత అది ఆగిపోతుందని ఇటీవలి బ్రిటిష్
అధ్యయనం కనుగొంది. మరో అధ్యయనం నలభై సంవత్సరాల వయస్సు తర్వాత మానసిక సామర్థ్యాలు
క్షీణించడం ప్రారంభిస్తాయని ధృవీకరిస్తుంది. దివ్య ఖుర్ఆన్ మనిషి నలభై ఏళ్ళ వయసులో
పూర్తి బలం వచ్చే వయసును చేరుకుంటాడు మరియు తరువాత క్షీణించడం ప్రారంభిస్తాడు అని
పేర్కొన్నది.
.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా చెప్పాడు:
"మేము మానవునికి అతను తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలని ఉపదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన
గర్భం లో పెట్టుకొని మోసింది; ఎంతో శ్రమతోనే అతనిని కన్నది. అతనిని గర్భంలో
పెట్టుకొని మోసేందుకు, అతనిచే పాలు మానిపించేందుకు ముపైమాసాలు పట్టింది. చివరకు
అతను పరిపూర్ణ శక్తినిని పొంది నలబై సంవత్సరాల వయస్సుకు చేరినప్పుడు, ఇలా
అన్నాడు, “ నా ప్రభూ! నాకూ,
నాతల్లితండ్రులకూ నీవు ప్రసాదించిన మహాభాగ్యలకుగాను, నీకు కృతఙ్ఞతలు తెలిపే, నీవు
ఇష్టపడే సత్కార్యాలు చేసే సద్భుద్దిని నాకు ప్రసాదించు. ఇంకా, నా సంతానాన్ని కూడా
మంచి వారుగా చేసి నాకు సుఖాన్ని ఇవ్వు. నీను నీ సన్నిధిలో పశ్చాతాప పడుతూ నీ
వైపుకు మరలుతున్నాను. నేను విధేయు(ముస్లిం)లైన దాసులలో వాడను.” అహ్కాఫ్: 46: 15
ఇస్లాం సందేశం పట్ల సందేహవాదులకు మా ప్రశ్న
ఏమిటంటే, 1400 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త మొహమ్మద్ (స) కు నలభై ఏళ్ళ వయసు అనేది పరిపూర్ణ మానసిక
సామర్థ్యాల వయస్సు అని మరియు అది అలాంటి
సామర్థ్యాల క్షీణత మధ్య విభజన రేఖ అని ఎలా తెలుసు?.
No comments:
Post a Comment