విభజన
సమయంలో అగ్రశ్రేణి ముస్లిం నాయకత్వం సరిహద్దు దాటి వలస వెళ్ళినప్పుడు ఈ దేశం లో
ఉన్న సాధారణ ముస్లిం ప్రజలు నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్నప్పుడు ముస్లిం సమాజానికి నాయకుడు గా
నిలిచి సహాయం చేసిన వ్యక్తి ముల్లా జాన్
మొహమ్మద్. భారతదేశంలో విభజన అనంతర కాలంలో కీలక పాత్ర పోషించిన నాయకులలో ముల్లా
జాన్ మొహమ్మద్ ఒకరు.
భారతదేశంలో కలకత్తా బ్రిటిష్
సామ్రాజ్యం యొక్క పూర్వ రాజధాని మాత్రమే కాదు,
ఇది
ముస్లింల ప్రముఖ కేంద్రంగా కూడా ఉంది. అగ్ర నాయకులు డాకా కు వలస వెళ్లినప్పటికీ, మిలియన్ల మంది ముస్లింలు పశ్చిమ
బెంగాల్‌లోనే ఉన్నారు.
కలకత్తా నగరం విభజనకు ముందు అల్లర్లతో దద్దరిల్లినది.
విభజన తరువాత, కూడా అల్లర్లు మరియు హత్యలు జరిగాయి. మత విద్వేషాలు ప్రబలిన ఈ పరిస్థితిలో ముస్లిం సమాజం ఆందోళన, భయాలు వంటి అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నది. ప్రజలకు మార్గనిర్దేశం చేసే సమర్ధవంతమైన నాయకత్వం అవసరం ఏర్పడినది..
అప్పటి ప్రముఖ నాయకులలో, బద్రుడుజా సాహెబ్ భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. 1950లో
పరిస్థితులు ఉద్రేకంగా ఉన్నాయి . 1955 లో పరిస్థితి మెరుగుపడింది. 1960 లో తిరిగి పరిస్థితి ఉద్రేకంగా మారి కోల్‌కతాలోని ముస్లింలు భయందోళనలకు గురి అయినప్పుడు వారి
నాయకుడిగా ముల్లా జాన్ మొహమ్మద్ ఉద్భవించారు. అతను ముస్లింలకు ఆశ మరియు భరోసా
యొక్క చిహ్నంగా మారినాడు.
ముల్లా జాన్ మొహమ్మద్, అలీ సోదరులతో కలసి పనిచేసాడు, బలమైన వ్యక్తిత్వo, నైతిక సూత్రాలు, స్థిరమైనవాడు, నిజాయితీపరుడు గా పేరుగాంచాడు. అందువల్ల,
అతన్ని
ఖాదీమ్-ఎ-ఖౌమ్ Khadim-e-Qaum అని పిలుస్తారు
1961 లో జబల్పూర్ అల్లర్లు దేశాన్ని కదిలించాయి. కోల్‌కతా, రూర్కెలా, జంషెడ్‌పూర్ నగరాల్లో అల్లర్లు జరిగినవి.. ముల్లా జాన్ ముహమ్మద్ చురుకుగా ఉపశమనం
మరియు పునరావాస చర్యలలో పాల్గొన్నారు.కోల్‌కతాలో 1963 మరియు 1965 లో జరిగిన అల్లర్లను అదుపులో
తేవడానికి రాజకీయ నాయకులను సమీకరణం చేయడం
లో ఆయన కీలకపాత్ర పోషించారు.
కలకత్తా ఖిలాఫత్ కమిటీ (సికెసి) కి ముల్లా
జాన్ మొహమ్మద్ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే,
కలకత్తా ఇస్లామియా హాస్పిటల్‌తో అనుబంధం కలిగి
ఉన్నారు.
అఖిల భారత ముస్లిం మజ్లిస్ మషవ్రాత్
ఏర్పాటులో కూడా ముల్లా జాన్ మొహమ్మద్ కీలక పాత్ర పోషించారు. ఇందులో సయ్యద్ మహమూద్
తో పాటు, మౌలానా అబుల్హాసన్ నద్వి అలియాస్ అలీ
మియాన్, ముఫ్తీ అతికుర్ రెహ్మాన్ ఉస్మానీ, ఇబ్రహీం సులేమాన్ సైట్, మౌలానా మంజూర్ నోమాని వంటి ప్రముఖ
నాయకులు పాల్గొన్నారు.
అల్లర్లతో బాధపడుతున్న నగరాలు మరియు
ప్రాంతాలకు పర్యటిoచచచడానికి ముల్లా జాన్ మొహమ్మద్ ఉలేమా పర్యటనను ప్లాన్ చేసారు..రాంచీ
పర్యటన పెద్ద విజయాన్ని సాధించింది.
మౌలానా ఆజాద్ ఆయనను 'ముల్లా' అని ప్రేమగా పిలిచేవాడు.
"ముల్లా జాన్ మొహమ్మద్ ఎల్లప్పుడూ సమాజ సమస్యలలో పాలుపంచుకోవడం, వాటిని పరిష్కరించడం మరియు సామాజిక నాయకత్వం చేయడం చూశాను. సమాజానికి సేవ
చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు" అని అబ్దుల్ అజీజ్ హలాత్-ఇ-బెంగాల్
పత్రిక కాలమ్‌లో రాశారు.
"కలకత్తా ఖిలాఫత్ కమిటీ 1919 లో ఉనికిలోకి వచ్చింది. కొన్ని
సంవత్సరాల తరువాత ఇస్లామియా హాస్పిటల్ నిర్మించబడింది. ముల్లా జాన్ మొహమ్మద్ జీవితమంతా
ఆసుపత్రికి తన సేవలను అందించాడు" అని మౌలానా తల్హా బిన్ అబూ సల్మా నద్వి ఒక
వ్యాసంలో రాశారు.
ఇస్లామియా హాస్పిటల్, కలకత్తా ఖిలాఫత్ కమిటీ మరియు మహ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ " తో అతనికి
మంచి అనుభంధం ఉంది..
ముల్లా జాన్ మొహమ్మద్ ఇస్లామియా
ఆసుపత్రిలో ఉచిత వైద్య విధానం ను ప్రవేశ పెట్టారు. 1967
లో, ముల్లా జాన్ మొహమ్మద్ హజ్ కోసం వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేటప్పటికి ఆసుపత్రి అధికారులు అవుట్ పెషoట్స్ కు 'ఆథ్ అన్నా' ఫీజును నిర్ణయించారని
తెలుసుకున్నప్పుడు చాలా కోపంగా ఆసుపత్రి గేటు వద్ద కూర్చుని, ఫీజ్
చెల్లించిన ప్రతి వ్యక్తి కి ఫీజ్ వాపసు చేసినారు.
No comments:
Post a Comment