22 June 2021

అల్లాహ్ గృహం (మస్జిద్) లో ఇస్లామిక్ మహిళలు The Women of Islam in the House of Allah

 



 



 

 

ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా తన అనుచరులను హెచ్చరించారు: "మహిళలను  మసీదు (ప్రార్థన కోసం) రాకుండా నిరోధించవద్దు". అల్లాహ్, లేదా అతని దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ఆజ్ఞ  ఇస్తే, ముస్లింలు  ఆ ఆజ్ఞకు  లోబడి, దానిని పాటించాల్సిన మతపరమైన బాధ్యత ఉంది. అల్లాహ్ లేదా అతని దూత నుండి వచ్చిన ఆజ్ఞను ఉల్లంగించే  అధికారం ఎవరికీ లేదు. కాని ఆజ్ఞ ఉన్నప్పటికి  అల్లాహ్ ఇంట్లో(మస్జిద్) లో  ముస్లిం మహిళలను రానివ్వడం లేదు.

మహిళాల హక్కులకు సంబంధించి ప్రవక్త యొక్క స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇస్లామిక్  ప్రపంచo దానిని పాటించడం లేదు. ముస్లిం మహిళలను  మసీదుకు రావడానికి అనుమతించినప్పటికీ, పురుషులతోపాటు  ఒకే స్థలంలో ప్రార్థన చేయడానికి వారిని అనుమతించరు. బదులుగా, వారికి ప్రత్యేక స్థలం కేటాయించబడుతుంది. ఇది ఒక ప్రత్యేక భవనం, ఒక అనెక్స్, మేడమీద గ్యాలరీ, ఒక నేలమాళిగ అయి  ఉండవచ్చు. ఒకవేళ పురుషులతో ఒకే అంతస్తులో కలసి ప్రార్థన చేయడానికి వారిని అనుమతించినప్పుడు, వారి మద్య ఒక అవరోధం సృష్టించబడుతుంది. (ఇటుకలు, కలప, వస్త్రం మొదలైనవి)

ప్రార్థన కోసం రెండు వేర్వేరు ప్రదేశాలను సృష్టించేబడతాయి - ఒకటి పురుషులకు మరియు మరొకటి మహిళలకు. సాధారణం గా మహిళల కోసం సృష్టించబడిన ప్రత్యేక స్థలం పురుషుల వెనుక భాగంలో ఉంటుంది; మహిళలకు ప్రత్యేక స్థలాన్ని సృష్టించడంతో పాటు, మహిళలు  వారి కళ్ళతో కాకుండా వారి చెవులతో ఒంటరిగా ప్రార్థన చేయడం జరుగుతుంది. మహిళలు ప్రార్థనలో సమాజాన్ని (జమాత్ ) చూడలేరు. వారు ప్రార్ధన మాత్రమే వినగలరు!

ముహమ్మద్ ప్రవక్త(స) మస్జిద్‌లో స్త్రీలను పురుషుల వెనుక ఒకే స్థలంలోప్రార్థన చేయమని చాలా స్పష్టంగా చెప్పారు. పురుషులు మరియు మహిళలకు చెవులు మరియు కళ్ళు రెండింటిద్వారా  ప్రార్థించే హక్కు ఇచ్చారు.

అబూ హురైరా ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు: పురుషులకు (మసీదులో) ఉత్తమమైన వరుస మొదటి (వరుస) మరియు చెత్త లేదా అత్యంత ప్రమాదకరమైనది చివరిది; (మసీదులో) స్త్రీకి ఉత్తమ వరుస చివరిది, మరియు చెత్త (లేదా అత్యంత ప్రమాదకరమైనది) మొదటిది. -(సహి ముస్లిం)

పైన పేర్కొన్న హదీసు ప్రకారం పురుషులు మసీదులో మొదటి  ముందు వరుసలో ఉండాలి.  ఒకవేళ మహిళలు మసీదులో ప్రార్ధన/ సలాత్‌కు హాజరు కావాలని అనుకొంటే  వారు వరుస చివరి లో ఉండాలి.  పురుషులు (ముందు వరస లో ఉన్నవారు ) కూర్చునే అవకాశం వచ్చేవరకు స్త్రీలు తమ తలలను సాష్టాంగ పడటం (సిజ్దా) లో ఉంచాలని ప్రవక్త(స) ఆదేశించారు:

"అబూ బకర్(ర) కుమార్తె అస్మా కథనం ప్రకారం: అల్లాహ్ యొక్క దూత చెప్పినట్లు నేను విన్నాను: అల్లాహ్‌ను మరియు చివరి రోజును  విశ్వసించిన స్త్రీలు,  ప్రార్ధన లో పురుషులు తల ఎత్తే వరకు (సాష్టాంగపడిన/సజ్దా  తరువాత) తల ఎత్తకూడదు, "(సునన్ అబౌ దాద్)

ప్రవక్త(స) చెప్పినట్లు  మసీదులో స్త్రీలు, పురుషులతో  వారి వెనుక ఒకే స్థలంలో ప్రార్థనలు చేసారు మరియు వారు చెవులు మరియు కళ్ళు రెండింటితో  ప్రార్థించుతారు. కాని ఒకవేళ మహిళలు తమ సలాత్‌ను ఇంట్లో ఎంచుకుంటే, అది మంచిది

అల్లాహ్ ఇంట్లో కూడా మహిళలు తమ హక్కులను కోల్పోయే ప్రస్తుత పరిస్థితికి పరిష్కారం చాలా స్పష్టంగా ఉంది. ముస్లింలు ఇప్పుడు మసీదుకు మహిళలను అనుమతించమని పట్టుబట్టాలి; వారు పురుషులతో పాటు ఒకే స్థలంలో వారి వెనుక ప్రార్థన చేయడానికి మరియు కళ్ళు మరియు చెవులు రెండింటితో  ప్రార్థన చేయడానికి అనుమతించబడాలి.

No comments:

Post a Comment