ఆప్టిక్స్ పై ఇబ్న్
అల్-హేతం యొక్క ప్రధాన రచన, “కితాబ్ అల్-మనాజీర్”, పశ్చిమంలో థెసారస్
ఆప్టికస్ గా ప్రసిద్ది చెందింది. అతను కంటి నిర్మాణాన్ని అధ్యయనం చేశాడు మరియు
దృష్టి ప్రక్రియను సరిగ్గా వివరించాడు.
కంటిచూపు యొక్క ఖచ్చితమైన లెక్కనుచెప్పి కాంతి వస్తువునుండి కంటిపైకి
ప్రసరించుచున్నదని మొదటగా చెప్పినాడు.
కితాబ్ అల్-మనాజీర్
కంటిని మరియు కేంద్ర నాడీ వ్యవస్థకు దాని కనెక్షన్‌ను వివరించే పురాతన
రేఖాచిత్రాన్ని కలిగి ఉంది. ఈ పుస్తకం 1083 లో బాస్రాలో కాపీ
చేయబడింది మరియు అల్-హజెన్ యొక్క పెర్షియన్ వ్యాఖ్యాత కమల్ అల్-దిన్ అల్-ఫరీసి చేత
ఎడిట్ చేయబడినది.
కితాబ్ అల్-మనాజీర్ యొక్క
ఆంగ్ల అనువాదం నేటికీ ఉపయోగించబడుతుంది. రెటీనా, కార్నియా, విట్రస్ హ్యుమర్ vitreous humor మరియు సజల హ్యుమర్ aqueous humor కన్ను ఎలా
పనిచేస్తుందాని పై ఇబ్న్ అల్-హేతం కు లోతైన
అవగాహన ఉంది మరియు కెమెరా అబ్స్క్యూరా camera obscura తో పోల్చగల
సామర్థ్యం కారణంగా, ఇబ్న్ అల్-హేతం కాంతిని అధ్యయనం చేయగలిగాడు, కాంతి వక్రీభవనం light refraction యొక్క అనేక పూర్వ సిద్ధాంతాలను మెరుగుపరిచాడు మరియు
రంగులు ఎలా సృష్టించబడ్డాడు అనే దాని గురించి తన సొంత సిద్ధాంతాలను
ప్రతిపాదించాడు.
వక్రీభవన కోణానికి అనులోమానుపాతంలో
ఉందనే టోలెమి లా చిన్న కోణాలకు మాత్రమే
నిజమని ఇబ్న్ అల్-హేతం నిరూపించాడు మరియు కాంతి కిరణాలు బాహ్య వస్తువుల నుండి
కంటిలోకి ప్రయాణించాయి కాని దానికివ్యతిరేక మార్గం లో కాదు అనే పాపులర్ నమ్మకాన్ని విస్మరించాడు.కాంతి దాని మూలంతో
సంబంధం లేకుండా ఒకేలా ఉందని అతను గుర్తించాడు మరియు సూర్యరశ్మి, అగ్ని నుండి వచ్చే
కాంతి లేదా అద్దం నుండి ప్రతిబింబించే కాంతి అన్ని ఒకే స్వభావం కలవని ఉదాహరణలు
ఇచ్చాడు
కాంతి మరియు రంగు light and color రంగానికి ఇబ్న్ అల్-హేతం అందించిన మరో ముఖ్యమైన సహకారం
ఏమిటంటే, కాంతి అనేది వేరియబుల్ వేగాన్ని కలిగి ఉంటదని మరియు ఇది దట్టమైన పదార్ధాలలో తక్కువగా ఉంటుంది. ఇది రంగు
సిద్ధాంతానికి నాందిపలికినది,
ఇబ్న్ అల్-హేతం
యొక్క ప్రారంభ సిద్ధాంతం ఏమిటంటే, మేఘాలు కంటికి చేరేముందు సూర్యుడి
నుండి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తాయి, ఇది ప్రయోగాత్మకoగా
ధృవీకరించబడలేదు..
ఇబ్న్ అల్-హేతం రిఫ్రాక్షన్,రిఫ్లెక్షన్,బైనాక్యులర్ విజన్,లెన్సుల ఫోకస్,రైన్ బో,
పారబోలిక్,స్ఫెరికల్ అద్దాలు,
స్ఫెరికల్ అబెర్రషన్,అట్మాస్ఫెరిక్ రెఫ్రాక్షన్, మరియు సూర్య వలయం సమీపంలోని ప్లానీటరి వస్తువుల సైజ్ పెరుగుదలపై
పరిశోదనలు ప్రచురించినాడు.
1236 లో జన్మించిన
ఖుత్బ్ అల్-దిన్ అల్-షిరాజీ అనే ఖగోళ శాస్త్రవేత్త ఆప్టిక్స్ పట్ల అల్-హేతామ్
ఆసక్తిని కొనసాగించారు. ఇంద్రధనస్సు ఏర్పడటానికి మొదటి సరైన వివరణ ఇచ్చినది అల్-షిరాజీ.
అల్-హేతామ్ యొక్క ప్రసిద్ధ
విద్యార్థి కమల్ అల్-దిన్ అల్-ఫరీసి గణితశాస్త్రంలో రెండు ప్రధాన రచనలు చేసినాడు-
ఒకటి కాంతి మరియు మరొకటి సంఖ్య సిద్ధాంతం number theory
ఇబ్న్ అల్-హేతం
యొక్క కృషిని ముందుకు తీసుకెళ్ళమని చేయమని కమల్ అల్-దిన్ అల్-ఫరీసి కు అల్-షిరాజీ సలహా
ఇచ్చినాడు.
అల్-ఫరిసి అప్పుడు కితాబ్ అల్-మనాజీర్ గ్రంథం గురించి సమగ్ర అధ్యయనం చేసాడు, అల్-షిరాజీ దాని
యొక్క పునర్విమర్శను వ్రాయమని సూచించాడు
అల్-ఫరీసి మరింత ముందుకు వెళ్ళాడు - ఇబ్న్ అల్-హేతం యొక్క కొన్ని
సిద్ధాంతాలు తప్పు అని తన్కిహ్ (అర్ధం పునర్విమర్శ) సూచించినాడు మరియు ప్రత్యామ్నాయ సిద్ధాంతాలను ప్రతిపాదించినాడు..
.
అల్-ఫరీసి అతి ముఖ్యమైన “ప్రతిపాదన” ఇంద్రధనస్సు
సిద్ధాంతం. ఇబ్న్ అల్-హేతామ్ మొదట ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా, అల్-షిరాజీ దానిని
విస్తరించినప్పటికి అల్-ఫరీసి దానిని
సవరించి, నవీకరించారు, ఇది ఇంద్రధనస్సు పై మొదటి గణితశాస్త్ర సంతృప్తికరమైన వివరణ.
No comments:
Post a Comment