ఆధునిక శాస్త్రజ్ఞులు జీవకోటి మనుగడకు జలం అవసరమని, జలం లేకుండా
ప్రాణికోటి బ్రతకజాలదని తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. చంద్రుడు, అంగారక గ్రహం
పైన నీటి జాడలు కన్పించాయని ఇటివలి పరిశోధనలు నిర్ధారించాయి. ఈవిషయాన్ని 1400
సంవత్సరాల క్రితమే ఏ మాత్రం శాస్త్రీయ ప్రగతి లేని రోజులలో దివ్య ఖురాన్ నిర్ధారించినది.
దివ్య ఖురాన్ లోని 21:30 ఆయతు ప్రకారం”(ప్రవక్త మాటలను విశ్వసించ కుండా)
తిరస్కరించినవారు ఈ విషయాలను గురించి ఆలోచించరా; ఆకాశాలు భూమీ పరస్పరం కలిసి
ఉండేవని, తరువాత మేము వాటిని వేరు చేశామనీ, ప్ర్రాణం ఉన్న ప్రతి దానిని నీళ్ళతో
సృష్టించామని?వారు (సృష్టించే మా ఈ శక్తిని) అంగికరించరా?
విజ్ఞాన శాస్త్రంలో పురోగతి సాధించిన తరువాత
మాత్రమే, సెల్/కణం యొక్క ప్రాథమిక పదార్ధం సైటోప్లాజమ్ 80% నీటితో తయారవుతుందని మనకు ఇప్పుడు
తెలుసు. ఆధునిక పరిశోధన చాలా జీవులు 50% నుండి 90% నీటిని కలిగి ఉన్నాయని మరియు ప్రతి
జీవికి దాని ఉనికి కి నీరు అవసరమని వెల్లడించింది. 14 శతాబ్దాల క్రితం ఏ మాత్రం శాస్త్రీయ జ్ఞానం లేకుండా నివసించిన మానవునికి
ప్రతి జీవి నీటితో తయారైందని ఊహించడం సాధ్యమేనా?
అరేబియా ఎడారులలో ఎప్పుడూ నీటి కొరత ఉన్న
మానవుడు అలా ఊహించగలడా? దివ్య ఖురాన్ లోని ఈ ఆయత్ నీటి నుండి
జంతువుల సృష్టిని సూచిస్తుంది: “
అల్లాహ్ ప్రతి ప్రాణిని నీటితో సృష్టించాడు.” [24:45]
క్రింది దివ్య ఖురాన్ ఆయత్ నీటి నుండి మానవులను
సృష్టించడాన్ని సూచిస్తుంది: "ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు. తరువాత
అతని ద్వారా (తన) వంశము, అత్తగారి వంశము అనే రెండు వేరువేరు బంధుత్వపు క్రమాలను
రూపొందించాడు. నీ ప్రభువు సర్వశక్తి సంపన్నుడు" [25:54]
No comments:
Post a Comment