ఫిబ్రవరి 21
ఎల్-హజ్ మాలిక్ షాబాజ్ అలియాస్ మాల్కంఎక్స్ కాల్చి చంపబడిన రోజు. అప్పటికి అతని
వయస్సు కేవలం 39 సంవత్సరాలు.
మాదకద్రవ్యాల
పెడ్లర్ నుండి నేషన్ ఆఫ్ ఇస్లాం లో సభ్యుడు మరియు వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడే
వ్యక్తి వరకు అతని కథ మనోహరమైనది మరియు ఉత్తేజకరమైనది.
వైట్ అమెరికన్లు ఈ బ్లాక్ ముస్లిం మాల్కం
ఎక్స్ ను తన ముక్కుసూటితనం మరియు నిర్భీతి వలన అసహ్యించుకోనేవారు.
మాల్కం X ను 'అమెరికాలో
అత్యంత భయపడే వ్యక్తి' గా అమెరికన్ ప్రెస్ అభివర్ణించింది.
అతని ఆత్మకథను 20 వ
శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన పది నాన్-ఫిక్షన్ పుస్తకాలలో ఒకటిగా టైమ్ మ్యాగజిన్ పరిగణిoచినది.
బాక్సింగ్ కింగ్
ముహమ్మద్ అలీ గురించి ప్రస్తావించిన వ్యాసాలు మరియు పుస్తకాల నుండి మాల్కం ఎక్స్
అలియాస్ డెట్రాయిట్ రెడ్ గురించి నేను తెలుసుకొన్నాను.
మాల్కం X అందరి జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. మైక్
మార్క్వీసీ Mike
Marquesee's వ్రాసిన పుస్తకం “రిడంప్షన్ సాంగ్ Redemption Song” నాకు బ్లాక్ మూవ్‌మెంట్‌ను మరింత వివరించినది.
నేను కొన్ని నెలల క్రితం మాల్కంX ఆత్మకథను చదివాను
1925 లో నెబ్రాస్కాలో జన్మించిన మాల్కం లిటిల్, ఒక షూ-షైనర్ మరియు డ్రగ్స్ డీలర్ గా జీవనం
ప్రారంభించి చివరికి జైలు జీవితం గడిపాడు. అక్కడ
అతను ఇస్లాం వైపు మరలాడు.
జైలు నుంచి విడుదలైన
తరువాత అతను ఎలిజా మొహమ్మద్ యొక్క వివాదాస్పద సంస్థ “నేషన్ ఆఫ్ ఇస్లాం”లో చేరాడు.
అతను తన ఇంటిపేరును తిరస్కరించాడు. ఆరోజులలో తమ పూర్వీకుల ఇంటిపేరు తెలియని మరియు అమెరికాకు
బానిసలుగా తీసుకురాబడిన మరియు క్రైస్తవులు గా మారిన చాలా
మంది నల్లజాతీయులు తమ తెల్ల జాతి యజమానుల
పేర్లను తమ ఇంటి పేరుగా స్వికరించేవారు. .
ధైర్యవంతుడు మాల్కం ఎక్స్
బలమైన అతని వ్యక్తిత్వం,
వక్తృత్వ నైపుణ్యాలు అమెరికన్ సాధారణ
పౌరులను ఆశ్చర్యపరిచాయి. మాల్కంఎక్స్ తన జీవితం లో ఎవరికీ భయపడలేదు. అతను తెల్ల
మనిషి యొక్క కపటత్వం గురించి మాట్లాడగలడు మరియు తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం
చేసేవాడు..
మొదటిసారి అతను
హజ్ యాత్ర చేసాడు. యుఎస్ లో ఇప్పటికీ ప్రబలంగా ఉన్న రంగు మరియు జాతి భేదం మరచి ఐరోపా
మరియు మధ్యప్రాచ్య దేశాలలోని ముస్లిం ప్రజలు
అతనిని తమ సొంత మనిషిగా భావించారు. .
అతను హాజ్ యాత్ర
నుండి సున్నీ ముస్లింగా తిరిగి వచ్చాడు.
అతను ఆఫ్రికాను సందర్శించాడు, ప్రపంచ నాయకులతో సంభాషించాడు మరియు ఇవన్నీ అతని
దృక్పథాన్ని విస్తృతం చేశాయి.
మాల్కంX
ప్రభావంతో, బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ కాసియస్ క్లే ముహమ్మద్ అలీ అయ్యాడు. మాల్కంX తన జీవితంపై
జరిగిన అనేక దాడుల నుండి బయటపడ్డాడు, కాని ఫిబ్రవరి 21న 400 మందితో జరిగిన సమావేశంలో జరిగిన దాడికి బలియ్యాడు.
మాల్కంX మరణం
ప్రపంచవ్యాప్తంగా పేపర్లలో ప్రచురించబడినది. లక్నో, బెంగళూరు మరియు కరాచీలలోని ఉర్దూ పేపర్లు
వర్ణవివక్షతో పోరాడటానికి వేలాది మందిని
ప్రేరేపించిన ఈ ధైర్యవంతుడి సంస్మరణను ప్రచురించాయి. దూర-తూర్పుFar-East మరియు ఆఫ్రికాలోని
వార్తాపత్రికలలో అతని మరణానికి సంతాపం తెలియచేస్తూ సంపాదకీయాలు వ్రాయబడ్డాయి.
చాలా సంవత్సరాలుగా అతనిని కలుస్తున్న అలెక్స్ హేలీ అతనితో జరిపిన
సంభాషణలు ఆధారంగా మాల్కంX ఆటో-బయోగ్రఫీ రాసారు.
.
.
No comments:
Post a Comment